విపత్తు నిర్వహణ చట్టం - 2005 కి అనుగుణంగా, దాని ప్రకారం నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NPDM) రూపొందించబడింది. విపత్తులను సమగ్ర పద్ధతిలో నిర్వహించడానికి ఫ్రేమ్ వర్క్/రోడ్ మ్యాప్ నుNPDM రూపొందిస్తుంది.
నివారణ, ఉపశమన, సంసిద్ధత మరియు ప్రతిస్పందన సంస్కృతి ద్వారా సంపూర్ణ, క్రియాశీల, బహుళ-విపత్తుల ఆధారిత, సాంకేతిక ఆధారిత వ్యూహాన్ని అభివృద్ధి చేయడం ద్వారా సురక్షితమైన, విపత్తులను తట్టుకునే భారతదేశాన్ని నిర్మించాలనే దృక్పథాన్ని NPDM కలిగి ఉంది.
జాతీయ విధానం ఏ విధంగా వ్యవహరిస్తుంది
సంస్థాగత, చట్టపరమైన, ఆర్థికపరమైన ఏర్పాట్లకు సంబంధించిన విపత్తు నిర్వహణ యొక్క అన్ని అంశాలు ఈ విధానంలో పొందుపరచడం జరిగింది. విపత్తు నివారణ, ఉపశమనం, సంసిద్ధత, సాంకేతిక చట్టపరమైన పాలన, ప్రతిస్పందన, ఉపశమనం, పునరావాసం, పునర్నిర్మాణం, పునరుద్ధరణ, సామర్థ్యం అభివృద్ధి, పరిజ్ఞాన నిర్వహణ, పరిశోధన మరియు అభివృద్ధి.
ఈ విధానం చర్యలు అవసరమైన అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టడమే కాకుండా అటువంటి చర్యలను మార్చగల సంస్థాగత యంత్రాంగాన్ని కూడా కలిగి ఉంటుంది.
NPDM విభిన్న వికలాంగులు, మహిళలు, పిల్లలు మరియు ఇతర వెనుకబడిన సమూహాలతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. ఉపశమనాల మంజూరు, విపత్తుల కారణంగా ప్రభావితమైన వ్యక్తుల పునరావాసం కోసం చర్యలను రూపొందించే విషయంలో, సమిష్టితత్వంతో సమస్యకు తగిన సూచనలు ఇస్తుంది.
కమ్యూనిటీ, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, పంచాయతీ రాజ్ సంస్థలు, స్థానిక సంస్థలు, పౌర సమాజం ప్రమేయం ద్వారా విపత్తు నిర్వహణ యొక్క అన్ని అంశాలలో పారదర్శకత మరియు జవాబుదారీతనం తీసుకురావాలని NPDM లక్ష్యంగా పెట్టుకుంది.
నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ - 2009 నేపథ్యం:
నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NPDM) పార్లమెంటుచే రూపొందించబడిన “విపత్తు నిర్వహణ చట్టం - 2005" లో భాగంగా డిసెంబర్ 26, 2005న భారత గెజిట్ లో నోటిఫై చేయబడింది. ఈ చట్టం విపత్తుల సమర్ధవంతమైన నిర్వహణ కోసం చట్టపరమైన, సంస్థాగత ఫ్రేమ్ వర్క్ ను అందిస్తుంది. ఈ చట్టం కొత్త సంస్థలను సృష్టించడం; కేంద్ర, రాష్ట్ర , స్థానిక ప్రభుత్వాలకు నిర్దిష్ట పాత్రలను అప్పగించడం వంటి విషయాలను తప్పనిసరి చేస్తుంది.
చట్టంలోని నిబంధనల ప్రకారం, ప్రధానమంత్రి అధ్యక్షతన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) ఏర్పాటు చేయబడింది. NDMA తన విధులు నిర్వర్తించడంలో సహాయం చేయడానికి కార్యదర్శుల జాతీయ కార్యనిర్వాహక కమిటీ (NEC) సృష్టించబడింది. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సృష్టించబడింది. దీనికి రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సహాయం అందిస్తుంది. జిల్లా స్థాయిలో జిల్లా విపత్తు నిర్వహణ అధికారులను ఏర్పాటు చేయడం జరిగింది.
విపత్తు నిర్వహణకు బాధ్యులు
విపత్తు నిర్వహణ ప్రాథమిక బాధ్యత పూర్తిగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానిదే. అయితే విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి రాష్ట్రాలకు కేంద్రం తనవంతు సహాయం చేస్తుంది. విపత్తు నిర్వహణ అనేది అన్ని విధాలైనటువంటి భాగస్వామ్యుల సమన్వయ సమ్మేళనంతో నిర్వహించబడే బహుళ విభాగ కార్యకలాపం. దీనిని రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేయబడిన సంస్థాగత యంత్రాంగంగా కూడా చెప్పవచ్చు.
విపత్తు నిర్వహణపై జాతీయ విధానం అందరికీ అనుకూలమైన వాతావరణాన్ని కల్పించింది. NPDM యొక్క ఫ్రేమ్ వర్క్ ప్రకారం ఏదైనా విపత్తును నిర్వహించడంలో వాటాదారులందరూ తమ వంతు కృషి చేయాలి. ప్రతి విపత్తు మనకు కొత్త పాఠాలు నేర్పుతుంది. ప్రభుత్వం/సమాజం దానికి అనుగుణంగా వాటిని స్వీకరించడం నేర్చుకుంటుంది. NPDM దేశంలో సంపూర్ణమైన, చురుకైన బహుళ విపత్తుల ఆధారిత మరియు సాంకేతిక ఆధారిత విధానాన్ని అభివృద్ధి చేయడంలో అత్యుత్తమ ఫలితాలను సాధించింది.
Pages