కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (Competition Commission of India) ఒక చట్టబద్ధమైన సంస్థ. 2003లో స్థాపించబడినప్పటికీ ఇది పూర్తిస్థాయిలో 2009 నుండి పనిచేయడం ప్రారంభించింది. ఇది భారతదేశంలో పోటీ నియంత్రణ సంస్థగా పనిచేస్తుంది. వాటాదారులు, ప్రభుత్వం మరియు అంతర్జాతీయ అధికార పరిధితో చురుకుగా వ్యవహరిస్తూ భారత ఆర్థిక వ్యవస్థలో పోటీ వాతావరణాన్ని నెలకొల్పడం లక్ష్యంగా కలిగి ఉంటుంది.

లక్ష్యాలు:

పోటీకి హాని కలిగించే పద్ధతులను నిరోధించడం. మార్కెట్లలో పోటీని ప్రోత్సహించడం, కొనసాగించడం. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడం. వాణిజ్య స్వేచ్ఛను నిర్ధారించడం. 

కమీషన్ ఏర్పాటు

  • కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాని పోటీ చట్టం 2002 (Competitio Act-2002) నిబంధనల ప్రకారం అటల్ బిహారీ వాజ్ పేయి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రారంభించింది.
  • కాంపిటీషన్ చట్టం-2002(Competitio Act-2002)ను సవరించడానికి కాంపిటీషన్ (సవరణ) చట్టం-2007 రూపొందించబడింది. ఇది కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరియు కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్థాపనకు దారితీసింది.
  • కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఏదైనా ఆదేశానికి లేదా నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీళ్లను విచారించడానికి, పరిష్కరించడానికి కాంపిటీషన్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
  • ప్రభుత్వం 2017లో కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ని నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ తో భర్తీ చేసింది. 

పోటీ చట్టం, 2002

పోటీ చట్టం(Competitio Act-2002), 2002 భారత పార్లమెంటుచే రూపొందించబడి, భారత పోటీ చట్టాన్ని నియంత్రిస్తుంది. ఈ చట్టం 2003లో రాష్ట్రపతి ఆమోదం పొందింది. గుత్తాధిపత్యం, నిర్బంధ వాణిజ్య అభ్యాసాల చట్టం, 1969 (MRTP చట్టం) రద్దు చేయబడింది. దాని స్థానంలో రాఘవన్ కమిటీ సిఫార్సుల మేరకు పోటీ చట్టం, 2002 రూపొందించబడింది.

చట్టం :

ఇది పోటీ వ్యతిరేక ఒప్పందాలను నిషేధించడమే కాకుండా, ఎంటర్ ప్రైజెస్ ద్వారా ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిషేధిస్తుంది. భారతదేశంలోని పోటీ పై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని కలిగించే లేదా కలిగించే అవకాశం ఉన్న కలయికలను నియంత్రిస్తుంది. ఈ చట్టం ఆధునిక పోటీ చట్టాల తత్వశాస్త్రాన్ని అనుసరిస్తుంది.

పోటీ చట్టాల అవసరం పోటీ చట్టాలు మూడు ప్రధాన విధులను నిర్వహిస్తాయి.

ఫ్రీ-ఎంటర్ ప్రైజ్ ను సమర్థించడానికి:  పోటీ చట్టాలను మాగ్నా కార్టా ఆఫ్ ఫ్రీ ఎంటర్ ప్రైజ్ అని పిలుస్తారు.

మార్కెట్ వక్రీకరణలకు వ్యతిరేకంగా భద్రత: వివిధ వ్యక్తులు మార్కెట్ వక్రీకరణలను ఆశ్రయించడం మరియు పోటీ వ్యతిరేక కార్యకలాపాలను ఆశ్రయించడానికి వారి ఆధిపత్య స్థానాలను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది, అందువల్ల మార్కెట్ వివిధ వక్రీకరణల నుండి సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి పోటీ చట్టాలు అవసరం.

దేశీయ పరిశ్రమల ప్రోత్సాహంలో కూడా సహాయపడతాయి: ప్రపంచీకరణ పెరుగుదలతో దేశీయ పరిశ్రమలు అణచివేయబడకుండా చూసుకోవడానికి పోటీ చట్టాలు అవసరం. దేశీయ పరిశ్రమల సాధ్యతను నిర్ణయించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయినప్పటికీ, ఎక్కువ ఆస్తులు లేని డిజిటల్ ప్రపంచంలోని వ్యాపారాలతో భారతీయ పోటీ చట్టాలను నవీకరించడానికి, భారత ప్రభుత్వం పోటీ చట్ట సమీక్ష కమిటీని ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి :

కాంపిటీషన్ కమిషన్ ఇండియా సభ్యులు (Members of Competition Commission of India)

కాంపిటీషన్ కమిషన్ ఇండియా విధులు & సవాళ్లు (Responsibilities and Challenges of Competition Commission of India)