ఆర్థిక వ్యవస్థలో లావాదేవీలు భౌతిక నగదు రూపంలో కాకుండా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్లు, ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాల ద్వారా చెలింపులు చేయబడినట్లయితే, అటువంటి ఆర్థిక వ్యవస్థను నగదు రహిత ఆర్థిక వ్యవస్థ అంటారు. సూక్ష్మంగా చెప్పాలంటే ఆర్థిక వ్యవస్థలో నగదు ప్రవాహం లేని పరిస్థితిని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా నిర్వచించవచ్చును. ఇందులో భాగంగా డైరెక్ట్ డెబిట్, క్రెడిట్ కార్లు , డెబిట్ కార్లు, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ వంటి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా, ఇమ్మిడియట్ పేమెంట్ సర్వీస్ (IMPS), నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT) మరియు రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS) మొదలైన చెల్లింపు వ్యవస్థల ద్వారా అన్ని రకాల ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి.

మొబైల్ వ్యా లెట్:

ఇది ప్రాథమికంగా మొబైల్ ఫోన్లో అందుబాటులో ఉండే వర్చువల్ వ్యాలెట్. దీనిలో భాగంగా ఆన్లైన్ లేదా ఆన్లైన్ చెల్లింపులు చేయడానికి మొబైల్ లో నగదును నిల్వ చేసే అవకాశం ఉంది. పలు రకాల సర్వీస్ ప్రొవైడర్లు ఈ వ్యాలెట్ లను మొబైల్ యాప్ల ద్వారా అందించగా, వాటిని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చు. క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ సేవలనుపయోగించి ఆన్లైన్లో ఈ వాలెట్లలోకి నగదును బదిలీ చేసుకోవచ్చు. అంటే వ్యాలెట్ ద్వారా ఆన్ లైన్ లో బిల్లులు చెల్లించినప్పుడు లేదా ఏదైనా వస్తువును కొనుగోలు చేసిన ప్రతిసారీ, వినియోగదారుడు తన కార్డ్ వివరాలను సమర్పించాల్సిన అవసరం లేదు. ఆన్ లైన్ ద్వారా అన్ని రకాల బిల్లులను చెల్లించడానికి, ఆన్‌లైన్ ద్వారా జరిపే కొనుగోళ్లకు వీటిని ఉపయోగించవచ్చు. తద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రోత్సాహం కలుగుతుంది.

ప్లాస్టిక్ మనీ:

క్రెడిట్, డెబిట్, ప్రీపెయిడ్ కాలు ఈ కోవలోకి వస్తాయి. వీటిని బ్యాంకులు లేదా నాన్-బ్యాంకులు జారీ చేయవచ్చు. అవి భౌతికంగా లేదా వాస్తవికంగా ఉండవచ్చు. వీటిని నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు మరియు రీఛార్జ్ చేయవచ్చు. ఆన్‌లైన్ లేదా పాయింట్-ఆఫ్-సేల్(POS)ల ఫ్ఘ కొనుగోళ్లు చేయడానికి కూడా వీటిని ఉపయోగించవచ్చు. గిఫ్ట్ కార్డ్స్ రూపంలో కూడా ఇవి లభిస్తాయి. వీటిని ఉపయోగించడం ద్వారా పలు ప్రాథమిక ప్రయోజనాలను పొందవచ్చును. ATMల నుండి డబ్బును విత్ డ్రా చేయడం, ఆన్ లైన్ చెల్లింపులు చేయడం; దుకాణాలు, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థల అవుట్ లెట్ లో POS టెర్మినళ్ళలో కొనుగోళ్లు లేదా చెల్లింపుల కోసం కార్డులను స్వైప్ చేయడం ద్వారా లావాదేవీలు పూర్తిచేయవచ్చును.

నెట్ బ్యాంకింగ్:

కంప్యూటర్ లేదా మొబైల్ ఫోన్ ద్వారా ఒక బ్యాంక్ ఖాతా నుండి మరొక బ్యాంక్ ఖాతాకు, క్రెడిట్ కాకు, తృతీయ వినియోగదారునికి నిధులను ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేసే విధానం. ఈ విధానంలో నగదు బదిలీ చేయాలంటే తప్పకుండా ఇంటర్నెట్ బ్యాంక్ యూజర్ ఐడి, పాస్ వర్డ్లను కలిగి ఉండాలి. ఇంటర్నెట్ ద్వారా బ్యాంక్ ఖాతాకు లాగిన్ అవడం ద్వారా నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (NEFT), రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS)ల ద్వారా నగదును మరొకరి ఖాతాకు సురక్షితంగా బదిలీ చేయవచ్చు. ఈ విధానంలో బ్యాంకువారు నామమాత్రపు లావాదేవీ రుసుములు వసూలు చేస్తారు.