42వ సవరణ చట్టం,1976లో చేయబడింది. భారత రాజ్యాంగానికి చేసిన ముఖ్యమైన సవరణలలో ఇది ఒకటి. అప్పట్లో శ్రీమతి ఇందిరా గాంధీ నేతృత్వంలో అధికారంలో ఉన్న కేంద్రప్రభుత్వం ఈ చట్టాన్ని చేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో పెద్ద ఎత్తున సవరణలు చేసినందుకు గాను దీనిని 'మినీ-రాజ్యాంగం' అని కూడా పిలుస్తారు.

భారత రాజ్యాంగం దేశం యొక్క పరిపాలనను నిర్ణయించడ మాత్రమే కాకుండా దేశంలో అత్యున్నత చట్టంగా కూడా పరిగణించబడుతుంది. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రముఖపాత్ర వహించిన రాజ్యాంగ పరిషత్ కూడా కాలానుగుణంగా అవసరమైనప్పుడు రాజ్యాంగానికి సవరణలు చేసే అవకాశం కల్పించింది. అందుకే, ఇప్పటి భారత రాజ్యాంగంలో చేయబడిన అనేక సవరణల కారణంగా గణనీయమైన మార్పులకు లోనవడం మనం గమనించవచ్చు. రాజ్యాంగ చట్టం, 1976 అని కూడా పిలువబడే 42వ సవరణ చట్టం భారత రాజ్యాంగానికి సవరణల చరిత్రలో అత్యంత వివాదాస్పద చర్యలలో ఒకటిగా పేర్కొనబడింది.

ఈ చట్టం ద్వారా చేయబడిన ముఖ్య మార్పులు :

  • సుప్రీంకోర్టు, హైకోర్టుల అధికారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు.
  • పౌరులకు ప్రాథమిక విధులను నిర్దేశించింది.
  • ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత పదాలు చేర్చబడ్డాయి.
  • 7వ షెడ్యూల్ లో రాష్ట్ర జాబితా నుండి చదువు, అడవులు, తూనికలు & కొలతలు, అడవి జంతువులు & పక్షుల రక్షణ, న్యాయ పరిపాలన అనే ఐదు అంశాలు ఉమ్మడి జాబితాకు బదిలీ చేయబడ్డాయి.
  • ఆర్టికల్ 51A ప్రకారం పౌరులకు 10 ప్రాథమిక విధులు జోడించబడ్డాయి. (1976లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు పౌరుల ప్రాథమిక విధులు జోడించబడ్డాయి)
  • కేబినెట్ సలహాకు రాష్ట్రపతి కట్టుబడి ఉండేలా చేయడం జరిగింది.
  • శాంతిభద్రతల వివాదాస్పద పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్రంలో కేంద్ర బలగాలను మోహరించేందుకు కేంద్రం అనుమతించబడింది (ఆర్టికల్ 257A).
  • లోకసభ స్పీకర్ మరియు ప్రధానమంత్రికి ప్రత్యేక విచక్షణాధికారాలు కల్పించారు (ఆర్టికల్ 329A)
  • ప్రాథమిక హక్కుల కంటే నిర్దేశక సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది ఈ మేరకు పార్లమెంటు చేసిన ఏదైనా చట్టం న్యాయస్థానం ద్వారా న్యాయ సమీక్ష పరిధికి మించి ఉంచబడుతుంది.
  • హైకోర్టు యొక్క న్యాయ అధికారాలు హైకోర్టుల న్యాయ సమీక్ష అధికారాన్ని తగ్గించింది ఆర్టికల్స్ 323 A మరియు 323B, పార్ట్ XIV-A
  • పార్ట్ XIV-A 'పరిపాలనా విషయాలతో వ్యవహరించే ట్రిబ్యునల్స్', 'ఇతర విషయాల కోసం ట్రిబ్యునల్స్' పేరుతో జోడించబడింది.
  • అప్పటికే అమలులో ఉన్న ఆదేశిక సూత్రాల జాబితాకు కొత్తగా మూడు జోడించబడ్డాయి. ఒక ఆదేశిక సూత్రం సవరించబడింది. పిల్లల ఆరోగ్యవంతమైన అభివృద్ధికి అవకాశాలను పొందేందుకు (ఆర్టికల్ 39).
  • సమాన న్యాయాన్ని ప్రోత్సహించడం, పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం (ఆర్టికల్ 39 ఎ) పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యాన్ని సురక్షితం చేసేందుకు చర్యలు తీసుకోవడం (ఆర్టికల్ 43 ఎ).
  • పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి మరియు అడవులు మరియు వన్యప్రాణులను సంరక్షించడానికి (ఆర్టికల్ 48 ఎ).