పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్
దీనిని 1948లో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రంగా కూడా దీనిని వ్యవహరిస్తారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం హవాయి(అమెరికా)లోని ఇవానా బీచ్ లో గలదు. అమెరికాకు చెందిన నేషనల్ ఓషానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ దీని నిర్వహణ వ్యవహారాలు చూస్తుంది. 2004లో హిందూమహాసముద్రంలో సంభవించిన సునామీ అనంతరం దీని సేవలను హిందూ మహాసముద్రం, కరేబియన్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా విస్తరించారు.
ఇంటర్నేషన్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్
దీనిని 1965లో ఏర్పాటు చేశారు. యునెస్కోకు చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమీషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికాలోని హవాయి రాష్ట్రంలో దీని ప్రధాన కేంద్రం కలదు.
పసిఫిక్ ప్రాంత సునామీ హెచ్చరిక సమన్వయ గ్రూపు
దీనిని 1968లో ఏర్పాటు చేశారు. పారిలోని ఇంటర్ గవర్నమెంటల్ ఓషనోగ్రాఫిక్ కమీషన్ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు.
ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్
1986లో ఏర్పాటు చేశారు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కేంద్రంగా దీనిని ఏర్పాటు చేశారు.
ప్రపంచ వాతావరణ సంస్థ
దీని ప్రధాన కేంద్రం జెనీవాలో కలదు. ఇది ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ.
సార్క్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెంటర్
2006 అక్టోబర్ లో నెలకొల్పారు. న్యూఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఆవరణలో దీనిని ఏర్పాటు చేశారు.
సౌత్ ఆసియాన్ డిజాస్టర్ నాలెడ్జ్ నెట్ వర్క్
ఇది సార్క్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఒక వెబ్ పోర్టల్.
ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్
1999లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు.
ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్
1988లో దీనిని ఏర్పాటు చేశారు. ప్రపంచ వాతావరణ సంస్థ, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమాలు సంయుక్తంగా దీనిని ఏర్పాటు చేశాయి. దీని ప్రధాన కార్యాలయం జెనీవాలో కలదు.
అవేర్ నెస్ అండ్ ప్రిపేర్డ్ నెస్ ఫర్ ఎమర్జెన్సీస్ ఎట్ లోకల్ లెవెల్
ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం ప్రభుత్వాలు, పారిశ్రామిక వర్గాలతో కలిసి సాంకేతిక ప్రమాదాలు, పర్యావరణ అత్యవసర పరిస్థితులు సంభవించకుండా తగ్గించడానికి, వాటి వల్ల జరిగే హానికర ప్రభావాలను కుదించడానికి ఈ సంస్థను రూపొందించారు.
అకాడమీ ఫర్ డిజాస్టర్ ప్లానింగ్ & ట్రైనింగ్
ఇది చెన్నైలో ఉన్న ప్రభుత్వేతర సంస్థ. విపత్తు నిర్వహణ రంగంలో శిక్షణ కోర్సులు అందించడంతో పాటు ప్రణాళికలు రూపొందిస్తుంది.
రీజనల్ ఇంటి గ్రేటెడ్ మల్టీ హజార్డ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ ఫర్ ఆఫ్రికా అండ్ ఆసియా
ఈ సంస్థను 2009లో ఏర్పాటు చేశారు. 2004లో సంభవించిన భయంకర సునామీ అనంతరం సమాంతర వైపరీత్యాలకు సంబంధించిన విపత్తుల ముందస్తు హెచ్చరికలు, విపత్తు నిర్వహణ వలయంలోని అన్ని చర్యలకు సంబంధించి ఒక ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. పాతుంథాని(థాయిలాండ్)లో గల ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ క్యాంపస్లో దీని ప్రధాన కార్యాలయం కలదు.
Pages