జంతు రాజ్యంలో ప్రోటోజోవా జీవులు ప్రాథమికమైనవి వీటిలో అనేక జీవులున్నప్పటికీ కొన్ని జీవులు మాత్రమే మానవునిలో వ్యాధులను కలిగిస్తున్నాయి. ఈ జీవులు ఒకరినుంచి మరొకరికి కలుషిత ఆహారం, నీరు, కీటకాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. ప్రోటోజోవా వ్యాధులు ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా కలుగుతాయి. ఈ ప్రాంతంలో వీటిని వ్యాపింపజేసే కీటకాలు పెరగడానికి అనువైన వాతావరణం ఉండటం వలన వీటి వ్యాప్తి ఈ ప్రాంతాలలో ఎక్కువ. ఉష్ణమండల ప్రాంతాలలో మలేరియా, అమీబియాసిస్ వంటివి అధికంగా మానవునికి సంక్రమిస్తూ ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రోటోజోవా వ్యాధులకు ఇప్పటివరకు వ్యాక్సిన్ల అభివృద్ధి జరగలేదు కాబట్టి వీటిని నియంత్రించడం కోసం యితర పద్ధతులు పాటించాలి. ఈ వ్యాధుల చికిత్సకంటే నివారణ ముఖ్యం. ఈ వ్యాధులు ముఖ్యంగా పిల్లల్లో వ్యాపిస్తూ ఇబ్బందులను కలిగిస్తున్నాయి. 

వ్యాధులు - కలుగచేసే ప్రోటోజోవా

* అమీబియాసిస్  - ఎంటమీబా హిస్టాలటికా 

* మలేరియా - ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవెల్ 

* లైడ్జినియాసిస్ లేదా అతి నిద్రావ్యాధి - ట్రపనోసోమా గాంబియెన్సీ 

* చాగా వ్యాధి - ట్రిపనోసోమా క్రుజి 

* టాక్సోప్లాస్మోసిస్ - టాక్సోప్లాస్మా గోండి 

* ట్రైకో మొనియాసిస్-ట్రైకోమోనాస్ వజినాలిస్ 

* బాలెంటడియల్ డీసెంటరీ-బాలంటిడియమ్ కోలీ 

* క్రిప్టో స్పోరిడియాసిస్ - క్రిప్టోస్పోరిడియమ్ పారమ్ 

* జీరార్డియాసిస్ - జిరార్డియా లాంబియా 

* పయోరియా (లేదా) జింజీవాలిస్ - ఎంటమీబా జింజివాలీస్