వైరస్లు కణం బయట నిర్జీవంగా ఉంటాయి. ఇవి సజీవ కణంలోకి లేదా మానవ శరీరంలోకి ప్రవేశించి సజీవంగా మారతాయి. వైరస్లు మానవులలోకి నీరు, గాలి, ఆహారం, కీటకాలు, ప్రత్యక్ష తాకిడి, మొదలైనటువంటి మార్గాల ద్వారా వ్యాపించి అనేక వ్యాధులను కలుగజేస్తాయి. బాక్టీరియా వ్యాధుల కంటే వైరస్ వ్యాధులు ఎక్కువ హానికరమైనవి వీటిని గుర్తుపట్టడం కష్టతరం. ఆంటిబయోటిక్స్ ఔషధాలు వైరస్లపై పనిచేయవు వీటిని ఎదుర్కోవడానికి ఇంటర్ ఫెరాన్లు లేదా ప్రత్యేక రసాయనాలు అవసరం. ఈ వ్యాధులను ఇమ్యునోలాజికల్ పద్ధతులను ఉపయోగించి నిర్ధారిస్తున్నారు. పరిసరాల శుభ్రత, టీకాలు తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వంటి పద్ధతుల ద్వారా వీటిని నివారించవచ్చు. 

వ్యాధులు - కలుగచేసే వైరస్

* చికెన్ పాక్స్ లేదా వేరిసెల్లా - వెరిసెల్లా వైరస్ లేదా చికెన్ పాక్స్ వైరస్ 

ఇంఫ్లూయెంజా (ఫ్లూ) - ఇంఫ్లూయెంజా వైరస్ 

* మీజిల్స్ (రూబెల్లా) - మీజిల్స్ వైరస్ 

* గవద బిళ్ళలు - పారామిక్సో వైరస్ (లేదా) మీక్సోవైరస్ పెరటోడిస్ 

* రెస్పిరేటరీ ఇన్ ఫెక్షన్ - రెస్పిరేటరి సిన్షియల్ వైరస్ 

* స్మాల్ పాక్స్ (వేరియోలా) - స్మాల్‌పాక్స్ వైరస్ లేదా వేరియోలా వైరస్ 

* కొలరాడో టిక్ ఫీవర్ - కొలిటవైరస్ 

* డెంగ్యు జ్వరం - ప్లావీవైరెస్ 

* ట్రకోమా - క్లమీడీయో ట్రాకోమాటిస్ 

* చికున్ గున్యా, ఎన్ సెఫలైటిస్-అల్ఫా వైరస్ 

* ఎయిడ్స్-హ్యుమన్ ఇమ్యునో వైరస్ 

* హెర్పిస్ - హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ 

* జలబు - రినో వైరస్లు
* సైటో మెగాలో ఇన్ క్లూసియన్ వ్యాధి - హ్యుమన్ సైటో మెగాలో వెరస్ 

* ల్యుకేమియా - హ్యుమన్ టి సెల్ ల్యుకేమియా వైరస్ 

* ఇన్ ఫెక్టియస్ మోనో న్యూక్లియోసిస్-ఎస్టీన్ బార్ వైరస్ 

* రేబిస్-రేబిస్ వైరస్ 

* హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ, - హెపటైటిస్ ఎ, బి, సి, డి, ఇ వైరస్లు 

* ఎక్యుట్ వైరల్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ - రోటావైరస్ 

* పోలియో - పోలియోవైరస్ 

* మెదడువాపు (లేదా) ఎన్ సెఫలైటిస్ - ఆర్బో వైరస్ 

* సార్స్ - కరోనా వైరస్ (సార్స్ కోవ్ -1)

* కోవిడ్ -19 - కరోనా వైరస్ 2 (సార్స్ కోవ్ -2)