మూలకణం అనగా ఏ కణం అయితే వివిధ అవయవాలుగా మారగలిగే సామర్థ్యం ఉండే దానిని మూలకణం కణం అంటారు. ఈ కణం అన్ని కణాలకు మూలం కాబట్టి దీనిని మూలకణం అంటారు. ఇవి 2 రకాలు అవి (1) పిండస్థ దశలో పిండం బ్లాస్టోసైట్ దశలో ఉన్నప్పుడు సేకరించే కణాలను పిండమూల కణాలు అంటారు. ఈ కణలు చాలా శక్తివంతమైనవి వీటిని పెంచి శరీరంలోని ఏ రకమైన కణాలుగా గాని లేదా అవయవాలుగా గాని మార్పు చెందించవచ్చు కాని వీటిని సేకరించడం పెంచడం కష్టం వీటిపై అనేక దేశాలలో నిషేధం వుంది. 2వ రకం మూలకణాలు అడల్ట్ మూలకణాలు వీటిని మనం జన్మించినప్పటి నుంచి అన్ని వయస్సులలో సేకరించవచ్చు. సేకరించిన అవయవాన్ని బట్టి వీటిని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. వీటిని బౌద్ధుతాడు నుంచి, ఎముక ములగ నుంచి, రక్తం నుంచి, కండరాల నుంచి, చర్మం, కన్ను వంటి వాటి నుంచి వేరుచేస్తారు. ఈ మూలకణాలు నిర్ణీత అవయవాలుగా మాత్రమే మారగలిగే అవకాశం ఉంది. ప్రపంచంలో అనేక సంస్థలు మూలకణాలపై పరిశోధనలు చేస్తున్నాయి. బెంగుళూరులోని నేషనల్ సెంటర్ బయోలాజికల్ సెంటర్, ఢిల్లీలోని నేషనల్ బ్రెయిన్ సెంటర్, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ వంటి సంస్థలలో పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశంలో మూలకణాలపై పరిశోధనకు మొదటి సారిగా ప్రత్యేక సంస్థ Clinical Research Facility For Stem Cells & Regenerative Medicineను హైదరాబాద్ లో స్థాపించారు. ఇది CCMB ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఇక్కడ గుండె జబ్బులు, కండర ఎముకల వ్యాధులు, జీర్ణకోశ, కాలేయ వ్యాధులతో పాటు మధుమేహం, వివిధ రకాల క్యాన్సర్ల చికిత్స పై పరిశోధనలు చేస్తారు. దృష్టిలోపం వచ్చిన వారిలో మూలకణాలను ఉపయోగించి దృష్టిని పూర్తిగా పునరుద్ధరించే ఒక సరికొత్త పద్ధతిని హైదరాబాద్ లోని L.V. ప్రసాద్ Eye Institute (LVPEI) కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు.

మూలకణాల యొక్క అనువర్తనాలు సాధారణ పద్ధతులలో చికిత్స సాధ్యంకాని అనేక వ్యాధుల మూలకణాల చికిత్సతో ప్రయోజనం చేకూరుతుంది. మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్ ఉత్పత్తికి అవసరమయ్యే లాంగర్ హాన్స్ పుటిక కణాలుగా మూలకణాలను మార్చి ఇన్సులిన్ లోపంను నివారించవచ్చు. పార్కిన్సన్ మరియు ఆల్జీమర్స్ వంటి నాండీ సంబంధ వ్యాధులకు మూలకణాలతో చికిత్స చేయవచ్చు. పక్షవాతం వల్ల, వెన్నుపూసలలో గాయాల వల్ల నాడీకణాలు నాశనమవుతాయి. వీటిని మూలకణాలతో భర్తీ చేయవచ్చు. గుండె జబ్బులతో గుండె కండరాలు దెబ్బతింటాయి. మూలకణాలలో గుండె కండరాన్ని దెబ్బతిన్న కార్నియాను పునర్నిర్మించి దృష్టిని ప్రసాదించవచ్చు. బొడ్డుతాడు నుంచి సేకరించిన రక్తాన్ని భవిష్యత్తులో ఆ శిశువుకు పక్షవాతం, గుండెజబ్బులు, నేత్రవ్యాధులు, నాడీకణాల భర్తీ, ఆస్టియాపోరోసిన్, ఆర్థరైటస్ వంటి వ్యాధులకు మూలకణాలతో చికిత్స అందించవచ్చు. పిండస్థ మూలకణాలతో పూర్తి అవయవాలను ఉత్పత్తిచేసి ప్రస్తుతం ఉన్న అవయవాల కొరతను తీర్చవచ్చు. పిండమూలకణాల అధ్యయనం ద్వారా పిండం పెరిగే ప్రక్రియను అధ్యయనం చేయవచ్చు. నూతన ఔషధాలు కనుగొనే ప్రక్రియను వాటి పనితీరును అధ్యయనం చేయవచ్చు.