1. శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (S.L.V.)

ఇవి మొదటితరం వాహక నౌకలు 40 కి.గ్రా.ల ఉపగ్రహాలను 300 కి.మీ. పైన కక్ష్యలో ప్రవేశపెట్టగలవు. వీటి ద్వారా రోహిణి ఉపగ్రహాలను 300 కి.మీ. పైన కక్ష్యలో ప్రవేశపెట్ట గలవు. వీటి ద్వారా రోహిణి ఉపగ్రహాలను ప్రయోగించారు. 

 • 1979 ఆగస్ట్ - మొదటి రోహిణి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు కానీ వాహక నౌక లోపం కూలిపోయింది. 
 • 19809 జులైలో ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 
 • 1981 మే లో S.L.V. --3 ద్వారా R.S.P.-1 (రోహి శాటిలైట్ డెవలప్ మెంట్) తక్కువ కక్ష్యలో ప్రయోగించారు. ఇది 9 రోజులకు కూలిపోయింది. 
 • 1983 ఏప్రిల్ లో S.L.V. - 3 ద్వారా R.S.P.-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. 

2. ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (A.S.L.V.)

ఇవి 2వ తరానికి చెందిన ఉపగ్రహ వాహక నౌకలు. వీటి ద్వారా 150-400 కిలోల బరువుగల ఉపగ్రహాలను 400 కి.మీ. కక్ష్యలోకి ప్రవేశ పెట్టవచ్చు. ఇవి 4 దశలలో ఘన ఇంధనాన్ని కలిగి ఉంటాయి. 

 • 1987 మార్చ్ 22న ASLVD-1 శ్రీహరికోట నుండి ప్రయోగించారు. కాని ఇది విఫలం కావడం జరిగింది. 
 • 1988 జులై 13న ASLVD-2 ప్రయోగం - విఫలం కావడం జరిగింది. 
 • 1992 మే 20న ASLVD.3 ద్వారా (ఫ్రాస్) (స్టె చౌడ్ రోహిణి శాటిలైట్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారు. 
 • 1994 మే 4న ASLVD 4 ద్వారా స్రాస్-సి-2 అనే 113 కి.గ్రా.ల ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దీనిలో స్వదేశి పరిజ్ఞానంతో చేయబడిన నికిల్ కాడ్మియం బ్యాటరీలను వాడటం జరిగింది. 

3. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (P.S.L.V.)

ఇవి 3వ తరం ఉపగ్రహ వాహక నౌకలు. వీటి సహాయంతో 1000 కి.గ్రా.ల బరువున్న ఉపగ్రహాలను 900 కి.మీ. ఎత్తున ప్రవేశపెట్ట గలిగారు. ఈ వాహక నౌకల ద్వారా ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లను సన్ సింక్రోనస్ కక్ష్యలో ప్రవేశపెట్టగలిగారు. వీటిలో ఘన, ద్రవ ఇంధనాలను వాడటం జరిగింది. మొదట ఘన, 2వదశ ద్రవ శివ దశ ఘన, 4వ దశ ద్రవ ఇంధనాలను వాడారు. 

 • 1993 సెప్టెంబర్ 20న PSLV - DI ద్వారా IRSP1 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. ఇవి సాఫ్ట్వేర్ లోపం వల్ల విఫలం కావడం జరిగింది 
 • 1994 డిసెంబర్ 15న PSLV - D2 ద్వారా IRSP2 ని విజయవంతంగా ప్రయోగించారు. 
 • 1996 March 21 న PSLV - DI ద్వారా IRSP3 ను శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే పెద్ద ఘన ఇంధనం వాడిన నౌక, దీనికి స్వదేశంలో తయారైన హైడ్రాక్సిల్ టర్మినేటెడ్ పాలిబ్యూటినను ఇంధనంగా వాడడం జరిగింది. 
 • 1997 సెప్టెంబర్ 29న I.R.S.I.D. ఉపగ్రహాన్ని P.S.L.V..CI ద్వారా ప్రయోగించారు. 
 • 1999 మే 26న 1.R.S.TH మరియు కిట్ శాట్ (కొరియా), టబ్ శాట్ జర్మనీ ఉపగ్రహాలను ఒకేసారి PSLVC2 ద్వారా ప్రయోగించారు. 
 • 2001 అక్టోబర్ 22న భారత్ టెక్నాలజీ ఎక్స్ప రిమెంట్ శాటిలైట్ (టెస్ TESS)ను మరియు జర్మనీకి సంబంధించిన బర్డ్ ప్రోబా ఉపగ్రహాలను P.S.L.V. C3 ద్వారా ప్రయోగించారు. దీని ద్వారా ఒకేసారి 3 ఉపగ్రహాలను ప్రవేశపెట్టి స్థాయికి భారత్ చేరుకొంది. 
 • 2003 అక్టోబర్ 17న I.S.R.P.6 (రీసోర్స్ శాట్) ఉపగ్రహాన్ని P.S.L.V. CS ద్వారా ప్రయోగించడం జరిగింది. 
 • 2003 అక్టోబర్ 17 భూపరిశీలనకు ఉపయోగపడే రిసోర్స్ శాట్-1ను పి.ఎస్.ఎల్.వి.-సిర్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. 
 • 2005 మే 5న కార్ట్ శాట్-1, ఎస్ఆర్ఎ-1, లపన్-టుబ్సాట్, అర్జెంటా అనే నాలుగు ఉపగ్రహాలను పిఎస్ఎల్‌వి-సి7 ద్వార కక్ష్యలోకి ప్రవేశ పెట్టారు. 
 • 2008 ఏప్రిల్ 28న పిఎస్ఎల్వీ-సి9 ద్వారా ఒకే సారి పది ఉపగ్రహాలను ప్రయోగించారు. 

4. జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్ (G.S.L.V. )

ఇవి 4వ తరం అధునాతనమైన వాహక నౌకలు వీటి సహాయంతో 2500 కి.గ్రా.ల ఉపగ్రహాలను 36000 కి.మీ. ఎత్తులో ప్రవేశపెడతారు. దీనిలో మొదటి దశలో ఘన ఇంధనం, ఇవదశలో ద్రవ ఇంధనం, 3వ దశలో క్రయోజెనిక్ ఇంజన్ ఉండటం జరుగుతున్నది. వీటి ద్వారా ప్రయోగించిన ఉపగ్రహ వివరాలు

 • 2001 ఏప్రిల్ 18న జి-శాట్ 1 ఉపగ్రహాన్ని G.S.L.V..DI ద్వారా ప్రయోగించారు. 
 • 2003 మే 8న జి-శాట్ 2 ఉపగ్రహాన్ని G.S.L.V.-D2 ద్వారా ప్రయోగించారు. 
 • 2004 సెప్టెంబర్ 20న ఎడ్యుశాట్ ఉపగ్రహాన్ని G.S.L.V..FI ద్వారా ప్రయోగించారు. 

ఇన్‌శాట్ వ్యవస్థ, ఉపగ్రహాలు

ఇన్‌శాట్(INSAT) అనగా ఇండియన్ నేషనల్ శాటిలైట్. దీనిని 1982లో భారతదేశం ప్రారంభించింది. ఈ వ్యవస్థ బహుళ ప్రయోజనకారి. ఒకే ఉపగ్రహం టెలివిజన్ ప్రసారాలు, కమ్యూనికేషన్, వాతావరణ పరిశోధన, రిమోట్ సెన్సింగ్ వంటి పనులు చేస్తుంది. ఇది డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పేస్ (DOS), డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (DOT), ఇండియన్ మెటియరలాజికల్ విభాగం (IMD) ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సంయుక్త ప్రాజెక్టు. దీనిలో 3 శ్రేణులున్నాయి. 

ఇన్‌శాట్-1  శ్రేణి ఉపగ్రహాలు 

 • వీటిని 1982 నుంచి ప్రయోగించడం జరిగింది. 
 • 1982 ఏప్రిల్ 10 నాడు అమెరికా నుంచి డెల్టా రాకెట్ ద్వారా INSAT - 1A ను ప్రయోగించారు. అది 5 నెలల తరువాత విఫలం కావడం జరిగింది. 
 • 1983 ఆగస్ట్ 30 నాడు అమెరికా నుంచి ఛాలెంజర్ వాహకనౌక కార్గ్ బే ద్వారా INSAT - 18ను ప్రయోగించారు. దీని కాల పరిమితి 7 సంవత్సరాలు. 
 • 1988 జూలై 22న ఇన్సాట్ 1సి ను ఫ్రెంచ్ గయానా నుంచి ప్రయోగించారు. విద్యుత్ వ్యవస్థ లోపంతో విఫలమైంది. 
 • 1990 జూన్ 12న అమెరికా కెన్నడి అంతరిక్ష ప్రయోగకేంద్రం INSAT - 10 ద్వారా ను ప్రయోగించారు.

ప్రథమశ్రేణి ఉపగ్రహాల ద్వారా టెలికమ్యూనికేషన్స్ విస్తరణ గణనీయంగా పెరిగింది. ఇంటర్ సిటీ నెట్ వర్క్ లు, ట్రంక్ మార్గాలు ఏర్పడ్డాయి. టెలివిజన్ ప్రసారాలు మెరుగయ్యాయి. 

ఇన్‌శాట్-2 శ్రేణి ఉపగ్రహాలు 

ఈ ఉపగ్రహాలను ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) స్వయంగా తయారుచేసి ఉపగ్రహ తయారీలో స్వావలంబనను సాధించింది. ఈ ఉపగ్రహాలన్నింటిని దక్షిణ అమెరికాలో ఫ్రెంచ్ గయానా వద్ద గల కౌరు అంతరిక్ష కేంద్రం నుండి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారు ఏరియన్ రాకెట్ల ద్వారా ప్రయోగించారు. ఈ ఉపగ్రహాలను అభివృద్ధి చెందిన కమ్యూనికేషన్ పరికరాలు ఉన్నాయి. వీటిలోని ట్రాన్స్పండర్లు ప్రపంచం మొత్తాన్ని కవర్ చేస్తున్నాయి. వాతావరణ పరిశీలన కోసం ప్రత్యేక ఛానల్ ఉంది. ఈ ఉపగ్రహాల వివరాలు

 • 1992 జూలై 10న ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి INSAT 2A ప్రయోగం 
 • 1993 జూలై 23న ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి INSAT 2B ప్రయోగం 
 • 1995 డిసెంబర్ 7న ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి INSAT 2C ప్రయోగం 
 • 1997 జూన్ 4న ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి INSAT PC ప్రయోగం 
 • 1999 ఏప్రిల్ 6న ఫ్రెంచ్ గయానా కౌరు నుంచి INSAT 2 ప్రయోగం 

ఇన్‌శాట్-3 శ్రేణి ఉపగ్రహాలు 

ఈ ఉపగ్రహాలు 2 వేల కిలోల బరువును కలిగి ఉండి భూమికి 36000 కి.మీ. ఎత్తులో పరిభ్రమిస్తూ ఉంటాయి. వీటిని ప్రధానంగా వాణిజ్య సమాచారానికి, మొబైల్ కమ్యూనికేషను కావలసిన విధంగా రూపొందించారు. ఈ ఉపగ్రహాలు వ్యాపార సంస్థలు, స్టాక్ మార్కెట్లు,

భారీ కంపెనీలకు ఎక్కువగా ఉపయోగపడును. ఈ శ్రేణిలో అనేక ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో 3ఎ, బి, సి, 34, 39 లను ఇప్పటికే ప్రయోగించారు.

 • INSAT JA-2003లో ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించారు. 
 • INSAT IB 2000లో ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించారు. 
 •  INSAT 3C 2002 జనవరి 24న ఫ్రెంచి గయానా నుంచి ప్రయోగించారు. 
 • INSAT 3D వాతావరణం కొరకు 
 • INSAT BE అత్యవసర సర్వీసుల కొరకు