సూక్ష్మజీవులలో వ్యాధిని కలిగించే వాటిలో బాక్టీరియా, వైరస్ వంటి వాటితో శిలీంద్రాలు కూడా ముఖ్యమైనవి. శిలీంద్రాల వలన కలిగే వ్యాధులను సర్వసాధారణంగా కలిపి మైకాసిస్టు అని అంటారు. ఇవి మానవ శరీరం పైన మరికొన్ని లోపల నివశిస్తూ చర్మవ్యాదులను మరియు అంతర్గత వ్యాధులను కలుగజేస్తున్నాయి. శిలీంధ్రాలు చర్మ వ్యాధులతో పాటు అలర్జీ అనే ప్రక్రియకు కారణమవుతాయి శిలీంద్రాలు చర్మం ఉపరితల భాగాలైన వెంట్రుకలు, పై చర్మం, గోళ్ళు వంటి వాటి పై ఆశించి వ్యాధులను కలుగజేస్తే వాటిని ఉపరితల శిలీంద్ర వ్యాధులు అని పిలుస్తారు. ఉపరితల శిలీంద్ర వ్యాదులు ఎక్కువగా చర్మంపై కాలి మరియు చేతివేళ్ళ మధ్య, చెమటపట్టే భాగాలు, తడిగా ఉండే భాగాల ద్వారా మరియు సరిగా ఉతకని దుస్తుల ద్వారా వ్యాపిస్తాయి. ఉపరితల శిలీంద్రాల వల్ల చర్మం దెబ్బతిని దురద, నొప్పి వంటివి కలుగుతాయి. దీనివల్ల చర్మం బాక్టీరియా సంక్రమణ జరిగి యితర వ్యాధులు కూడా సంక్రమించవచ్చు. 

శిలీంద్ర వ్యాధులలో రెండవ రకం వ్యాధులు అంతర్గత శీలింద్రవ్యాధులు. కొన్ని శిలీంద్రాలు వివిధ శరీర భాగాలలో అంతర్గతంగా నివశిస్తూ వ్యాధులను కలిగిస్తాయి మరియు ఆ భాగాన్ని ప్రభావితం చేసి నష్టపరుస్తాయి. ఈ రకమైన వ్యాధులు, ఊపిరితిత్తులు, జీర్ణక్రియభాగాలు, రక్తం వంటి వాటిలో కూడా కనబడవచ్చు. శిలీంద్రవ్యాధులు రావడానికి ఆహారలోపం, శరీరం బలహీనంగా వుండటం, పరిశుభ్రత పాటించకపోవడం, శరీరంపై చమట ఎక్కువట పట్టడం వంటి కారణాలుగా చెప్పవచ్చు. శిలీంద్రాలు బాహ్య లేదా అంతర్గతంగా కాక ఆహార పదార్థాలపై ధాన్యాలపై సంక్రమణ జరిపి విష పదార్థాలను ఉత్పత్తి చేసి మానవునికి వ్యాధులను కలిగిస్తాయి. ఆస్పర్జిల్లస్ జాతులు వేరుశెనగ, జొన్న, మొక్కజొన్న గింజలపై నివశిస్తూ అప్లోటాక్సిన్లు అనే విషపదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విషపదార్థాల వలన మానవునికి కాలేయ వ్యాధి అయిన సిర్రోసిస్ రావడానికి అవకాశం ఉంది. 

వ్యాధులు - కలుగచేసే శిలీంద్రాలు

* బ్లాక్ పయెడ్రా - పయె హర్టీ * 

వైట్ పయె డ్రా - ట్రైకోస్పోరాన్ బీజియెల్లి 

* టీనియావెర్సికోలా - మలసీజియా ఫర్ ఫర్ 

* టనియోబార్బె - ట్రైకోఫైటాన్ మెంట(ఫైట్స్ 

* జాయిచ్ - ఎపిడెర్మో, ఫైటాన్ ఫ్లోకోజమ్ 

* టినియాపెడిస్ - ట్రైకోఫైటాన్ రూబ్రమ్ 

* క్రోమోబ్లాస్టోమైకాసిస్ - ఫయలో ఫోరా వెర్రుకోసా 

* మధురా మైకాసిస్ - మధురెల్లా మైసిటోమాటిస్ 

* స్పోరో ట్రైకాసిస్ - స్పోరో త్రిక్స్ చిన్న 

* బ్లాస్టో మైకాసిస్ -బ్లాస్టోమైసిస్ డెర్మ టైటిస్ 

* హిస్టోప్లాస్మోసిస్-హిస్టోప్లాస్మా కాప్సులేటమ్ 

* కాక్సిడియోడో మైకాసిస్-కాక్సిడియోడిస్ ఇమీటస్ 

* ఆస్పర్జిల్లోసిస్-ఆస్పరిల్లస్ ప్యుమిగేటస్, ఆస్పరిల్లస్ ప్లావస్

* కాండిడియాసిస్ - కాండిడిడా ఆర్థికన్స్ 

* న్యూమోసిస్టిస్ న్యూమోనియా - న్యూమోసిస్టిస్ కారిని