క్రీ.శ. 1760 నుంచి మూడు దశాబ్దాలపాటు ఆంగ్లేయులకు, మైసూర్ పాలకులకు మధ్య జరిగిన యుద్దాలను ఆంగ్లో-మైసూర్ యుద్దాలు అంటారు. ఆంగ్లో-మైసూర్ యుద్దాలు మొత్తం నాలుగు జరిగాయి. దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులను ధైర్యంగా ఎదుర్కొన్న రాజ్యాలలో మైసూర్ ప్రముఖమైంది. మైసూర్ తరపున హైదర్ఆలీ, టిప్పు సుల్తాన్ జరిపిన పోరాట పటిమ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయం. 

మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1766-1769) 

భారతదేశం నుంచి ఆంగ్లేయులను పారదోలాలనే హైదర్ఆలీ ఆశయం. హైదర్ఆలీ ద్వారా తమకు ప్రమాదం ఎదురవుతుందని ఆంగ్లేయులు గ్రహించారు. హైదరిలీకి వ్యతిరేకంగా ఆంగ్లేయులు మరాఠాలతోనూ, హైదరాబాద్ నిజాంతోనూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడంతో హైదర్ఆలీ త్రైపాక్షిక ఒప్పందాన్నివిఫలంచేసి, ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించాడు. 

బ్రిటిష్ వారి స్థావరమైన మద్రాసు సమీపం వరకు హైదర్ఆలీ పలు ప్రాంతాలు ఆక్రమించాడు. మద్రాసును ఆక్రమించుకునే సమయంలో ఆంగ్లేయులునిస్సహాయులై హైదరిలీతో సంధికి అంగీకరించారు. టిష్ వారు సంధికి అంగీకరించకుంటే హైదర్ఆలీ మద్రాస్ ను ఆక్రమించేవాడు. ఒకవేళ మద్రాస్ ను ఆక్రమించి ఉంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర ఎలా ఉండేదో ప్రశ్నార్థకం. భారతీయ సంప్రదాయాలను అనుసరించి, ఆంగ్లేయులు మద్రాస్ సంధికి వచ్చినప్పుడు అదే న్యాయమని హైదర్ఆలీ భావించాడు. 

మద్రాస్ సంధి (1769) 

యుద్దానికి పూర్వం ఉన్న స్థితిని అంగీకరించాలి. అంటే యుద్ధకాలంలో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఎవరికి వారు ఇచ్చేయాలి. యుద్దానికి అయిన ఖర్చులకు నష్టపరిహారాన్ని ఆంగ్లేయులు హైదరిలీకి ఇవ్వాలి. ఈ రెండు పక్షాలలో ఎవరినైనా మూడోవారు ఎదిరిస్తే, ఇరుపక్షాల పరస్పరం సహాయపడాలి. ఈ సంధి ఫలితంగా ఆంగ్లేయులను ఆజ్ఞాపించదగిన స్థానాన్ని హైదర్ఆలీ పొందాడు. ఇరుపక్షాలు ఆర్థికంగా నష్టపోయాయి. 

రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1780-84) 

బ్రిటిష్ వారు మద్రాస్ సంధిని కేవలం తిరిగి యుద్ధం చేయడానికి వ్యవధి అవసరమని కుదుర్చుకున్నారు. హైది లీ కూడా ఆంగ్లేయుల ఉద్దేశం, నడవడిక గ్రహించాడు. పరస్పరం అపనమ్మకం పెంచుకున్నారు. హైదరాలీపై మరాఠాలు దాడిచేస్తే మద్రాస్ సంధి ప్రకారం హైదిలీకి ఆంగ్లేయులు సహకరించాలి. కానీ ఆంగ్లేయులు తటస్థ వైఖరిని అవలంబించారు. ఈ విధంగా మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్ వారు ఉల్లంఘించారు. ఆంగ్లేయులు - ఫ్రెంచివారి మధ్య యూరప్ లో ఘర్షణల కారణంగా హైదర్ఆలీ రాజ్యపరిధిలోని ఫ్రెంచివారి వర్తక స్థావరమైన 'మాహే'ను బ్రిటిష్ వారు ఆక్రమించారు. ఇంగ్లిష్ వారికి వ్యతిరేకంగా హైది లీ నైజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో పరిణామం. 

హైదర్ఆలీ యుద్దం మొదట్లో ఘనవిజాయాలు సాధించాడు. అయితే, అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ తన రాజకీయ చతురతతో నిజాం, మరాఠాలను తనవైపు తీసుకున్నాడు. 1781 లో పోర్ట్ నోవా వద్ద బ్రిటిష్ సేనాని సర్క్యూట్ హైది లీని ఓడించాడు. 1782లో హైది లీ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. దీనితో హైదర్ఆలీ కుమారుడైన టిప్పుసుల్తాన్ యుద్ధనిర్వహణ బాధ్యతలను స్వీకరించాడు. 1784 నాటికి ఎవరూ గెలిచే స్థితిలో లేకపోవడంతో మంగుళూరు ఒప్పందం చేసుకున్నారు. 

మంగుళూరు ఒప్పందం (1784) 

ఈ సంధిలో భాగంగా ఇరుపక్షాలు తాము గెలుచుకొన్న ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి. ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదు. ఎవరైనా దాడి చేస్తే ఒకరికొకరు సహకరించుకోవాలి. ఆంగ్లేయుల దగ్గర నుంచి హైదర్ఆలీ గెలుచుకున్న ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి. 

మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1790-1792) 

టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా ఆంగ్లేయులు హైదరాబాద్ నిజాం రాజులతోనూ మరాఠాలతోనూ ఒప్పందం కుదుర్చుకోవడం. టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్, టర్కీ దేశాల సహాయం పొందడానికి రాయబారాలు చేయడం. బ్రిటిష్ పక్షపాతి అయిన ట్రావెన్ కోర్ రాజు పై టిప్పు సుల్తాన్ దాడి చేస్తున్నారనే ఆరోపణ మొదలైన కారణాలతో గవర్నర్ జనరల్ కారన్ వాలీస్, టిప్పు సుల్తాన్ పై యుద్ధం ప్రకటించాడు. కారన్ వాలీస్ స్వయంగా యుద్దానికి నాయకత్వం వహించాడు. మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్నంపై దాడిచేసి, ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు. టిప్పు సుల్తాన్ తో సంధి చేసుకోవాల్సిందిగా మరాఠాలు, నిజాం రాజులు ఒత్తిడి తేవడంతో ఆంగ్లేయులు శ్రీరంగపట్నం సంధి కుదుర్చుకున్నారు. 

శ్రీరంగపట్నం సంధి  (1792) 

ఈ సంధి ప్రకారం టిప్పు సుల్తాన్ తన భూభాగంలో దాదాపు సగభాగం ఆంగ్లేయులు వారి మిత్రులకు ఇవ్వాలి. యుద్ధ నష్టపరిహారంగా మూడు కోట్ల మొత్తాన్ని టిప్పుసుల్తాన్ ఆంగ్లేయులకు చెల్లించాలి. ఆ పైకం చెల్లించేవరకు టిప్పుసుల్తాన్ ఇద్దరు కొడుకులను ఆంగ్లేయుల చెరలో ఉంచాలి. 

నాలుగో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1799) 

ఆంగ్లేయుల చేతిలో తమకు వాటిల్లిన అవమానకరమైన పరాజయానికి, ఆంగ్లేయులు తమపై విధించిన షరతులకు, ప్రతీకారం తీర్చుకోవాలనే టిప్పు సుల్తాన్ బలమైన కోరిక. విప్లవాత్మక ఫ్రాన్స్, ముస్లిం దేశాలైన అరేబియా, కాబూల్, టర్కీ తదితర దేశాల సహాయం కోసం టిప్పుసుల్తాన్ రాయబారులను పంపడం. టిప్పుసుల్తాన్ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ నిర్ణయం. వెల్లస్లీ సైన్య సహకార ఒప్పందానికి టిప్పుసుల్తాన్ అంగీకరించకపోవడం వంటి పరిణామాల కారణంగా ఈ యుద్ధం జరిగింది. టిప్పుతో పనిచేస్తున్న సైనికాధికారులు, ముఖ్య ఉద్యోగులు అతడికి సహాయం చేయకుండా తమవైపు చేరితేగాని విజయం సాధించలేమని వెల్లస్లీ భావించాడు. లంచమిచ్చి, అవినీతి మార్గాల ద్వారా తమ వైపు తిప్పుకొనేందుకు అయిదుగురితో కమిషన్ ఏర్పాటు చేశాడు. బ్రిటిష్ వారి దగ్గర లంచం తీసుకున్న సైన్యాధికారులు, టిప్పు సుల్తాన్ కు వెన్నుపోటు పొడిచారు. సైన్యాధికారులను పూర్తిగా నమ్మి బాధ్యతలు అప్పగించగా వారు టిప్పుసుల్తాన్ ను మోసగించారు. వారు ఆంగ్లేయుల సైన్యం సంఖ్య గురించి తప్పుు సమాచారం ఇచ్చారు. ఆంగ్లేయ సైన్యం దాడిచేసే మార్గంపై తప్పుడు సమాచారం ఇచ్చారు. అవినీతికి పాల్పడి సొంతవారే మోసం చేయడంతో టిప్పుసుల్తాన్ ఓటమి పాలయ్యాడు. వీరమరణం పొందాడు. 

యుద్ధంలో సహాయం చేసిన మైసూర్ ఉద్యోగులు ఆంగ్లేయుల నుంచి బహుమతులు పొందారు. టిప్పుసుల్తాన్ కు చెందిన పుస్తక భాండాగారాన్ని ఇంగ్లాండుకు తరలించారు. మైసూర్ పాలకుడిగా ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజు-3 ని నియమించారు. కృష్ణరాజు-3 బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడు. దుష్పరిపాలన కారణంగా 1831లో విలియం బెంటింక్ మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. 1882లో లార్డ్ రిప్పన్ వైస్రాయ్ కాలంలో వడయార్ రాజవంశీయులకు బ్రిటిష్ వారు మైసూర్ రాజ్యాన్ని అప్పగించారు. 

ఆంగ్లో-మైసూర్ యుద్ధంలో పాల్గొన్న మైసూర్ పాలకులు 

హైదర్ఆలీ (1761-1782) 

ఆధునిక భారతదేశ చరిత్రలో మైసూర్ రాజ్యా నికి విశేష పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పాలకుడు హైదర్ ఆలీ. విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత 'వడయార్ల' వంశపాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న మైసూర్ రాజ్యంలో హైదర్ఆలీ సైనికుడిగా జీవితం ప్రారంభించాడు. తక్కువ కాలంలోనే తన ప్రతిభతో 'దిండిగల్' ప్రాంతానికి ఫౌజుదార్ (శాంతిభద్రతలు చూసే అధికారి) అయ్యాడు.  ఫ్రెంచివారి సహాయంతో 'దిండిగల్'లో ఆయుధ కర్మాగారం స్థాపించాడు. క్రీ.శ. 1761లో కృష్ణరాజు వడయార్‌ను రాజ్యం నుంచి తొలగించి మైసూర్ స్వతంత్ర పాలకుడయ్యాడు. శ్రీరంగపట్నంను రాజధానిగా చేశాడు. ఆంగ్లో-మైసూర్ మొదటి, రెండో యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఇతను నిరక్షరాస్యుడు అయినా  అతడి అమోఘమినా జ్ఞాపకశక్తితో   దేశీయులనే కాకుండా విదేశీయుల మెప్పు పొందేవాడు. పరమత సహనంగలవాడు. రాజ్య పాలనలో అవసరమైనప్పుడు శృంగేరి శంకరాచార్యల సలహాలు తీసుకునేవాడు. సామాన్య ప్రజలకు సైనికులకు ఆరాధ్యదైవంగా వెలిగాడు.  అవసరమైతే రాత్రనక, పగలనక రోజుల తరబడి వానలో కూడా గుర్రం మీద ఎక్కడా నివకుండా స్వారీ చేసేవాడు. పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరుగా నిలిచాడు. హైదర్ఆలీ 1782లో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. 

టిప్పు సుల్తాన్ (1782-1799) 

ఇతను  హైదర్ఆలీ తనయుడు. 2వ , 3వ , 4 వ  ఆంగ్లో - మైసూర్ యుద్ధాలలో పాల్గొన్నాడు. . విదేశీ వర్తకాన్ని అభివృద్ధి చేసేందుకు ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, పెరూ దేశాలకు రాయబారులను పంపాడు. ఫ్రెంచి విప్లవంతో ప్రభావితమయ్యాడు. ఫ్రెంచి విప్లవానికి స్పూర్తిగా శ్రీరంగపట్నంలో స్వేచ్ఛావృక్షాన్ని నాటించాడు. ప్రెంచి విప్లవంలోని అతివాదుల సంఘం అయిన 'జాకోబియన్ క్లబ్ లో సభ్యుడిగా చేరాడు. మైసూర్ రాజ్యమంతా ఒకే విధమైన ద్రవ్యవిధానం, తూనికలు, కొలతలు ప్రవేశపెట్టాడు. శ్రీరంగపట్నంలోని రంగనాథ ఆలయానికి భూదానాలు చేసి పరమత సహనం పాటించాడు. శంకరాచార్యులను జగత్ గురువుగా భావించాడు. యూరప్ వారిని ఆదర్శంగా తీసుకుని ఆధునిక నౌకాదళాన్ని నిర్మించాడు. 'టైగర్ ఆఫ్ మైసూర్' గా కీర్తి పొందాడు.