హెచ్ యూఎంఎస్ఏ

నౌకల్లో ఉపయోగించగల దేశీయ సోనార్ హెచ్ యూఎంఎస్ఏ (హల్ మౌంటెడ్ సోనార్ అర్రె)ను కోచిలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబోరేటరీ రూపొందించింది. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. వీటిని నావికాదళానికి చెందిన నౌకల్లో బిగించారు. వచ్చే తరానికి (నెక్స్ట్ జనరేషన్) చెందిన సోనార్ వ్యవస్థలను హెచ్ యూఎంఎస్ఎ-ఎజ్ పేరుతో మరింత అభివృద్ధి పరిచారు. వీటిలో తక్కువ పౌనఃపున్యంలోని ట్రాన్స్ట్యూజర్లు, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రాసెసర్లను, %ఐంజుష్టు% సిగ్నల్ ప్రాసెసింగ్ బోర్డులను ఉపయోగించారు. హెచ్ యూఎమ్ఎస్ఏ సోనార్లను కొంత ఆధునీకరించి హెచ్ఎమ్ఎస్-ఎక్స్ సోనార్లుగా మయన్మార్ కు ఎగుమతి చేస్తున్నారు.

పంచేద్రియ

ఇది భారతదేశం తయారుచేసిన మొదటి సబ్ మెరైన్ సోనార్. దీన్ని కూడా డీఆర్డీవో అనుబంధ సంస్థ అయిన నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబోరేటరీ (ఎస్ పీవోఎల్) అభివృద్ధి చేసింది. వీటిని సింధుఘోష్, వేల, కిలో-క్లాస్ రకానికి చెందిన సబ్ మెరైన్ లో అరిహంత్ రకపు సబ్ మెరైన్లలో ఉపయోగించారు.

యూఎస్ హెచ్ యూఎస్

ఇది శత్రువుల జలాంతర్గాములు, నౌకలు, టార్పెడోలను గుర్తించే అధునాతన ఏకీకృత సోనార్ వ్యవస్థ. దీన్ని భారత తొలి అణుశక్తి చోదక సబ్ మెరైన్ అరిహంత్ లో ఉపయోగించనున్నారు. ఇది సబ్ మెరైన్ రకానికి చెందిన సోనార్.

ఎమ్ ఐ హెచ్ఐఆర్

ఇది హెలికాప్టర్ రకానికి చెందిన సోనార్. వీటిని అడ్వా న్స్డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్ హెచ్)లో బిగించనున్నారు. ఇది నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ ల్యాబోరేటరీ (ఎన్‌పీవోఎల్) తయారుచేసిన తక్కువ పౌనఃపున్య డంకింగ్ సోనార్ (ఎల్‌ఎ డీఎస్). ఇది హెలికాప్టర్ నుంచి కేబుల్ ద్వారా నీట మునిగి శత్రువుల సబ్ మెరైన్లను గుర్తిస్తుంది.

టాడి పోల్ సానబాయ్

తొడుగులో ఉండే చిన్న సోనార్ వ్యవస్థ. దీన్ని ఎస్పీవోఎల్ అభివృద్ధి చేసింది. 2000 సంవత్సరం నుంచి భారత నావికాదళంలో ఉపయోగిస్తున్నారు. ఇది పారాచ్యూట్ సహాయంతో సముద్ర ఉపరితలాన్ని చేరిన తర్వాత విచ్చుకుని తన పనిని ప్రారంభిస్తుంది. సేకరించిన సమాచారాన్ని రేడియో తరంగాల రూపంలో గ్రాహక వ్యవస్థకు పంపిస్తుంది. బెంగళూరుకు చెందిన టాటా పవర్ కన్సల్టెన్సీ లిమిటెడ్ సంస్థ దీన్ని రూపొందించింది.