మీజాన్

ఫిబ్రవరి 1941లో ప్రారంభమైనది. దీనికి యజమాని కలకత్తాకు చెందిన గులాం మహ్మద్. హైదరాబాద్ లో స్థిరపడి ఏక కాలంలో ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ మూడు భాషల్లో దినపత్రికను ప్రారంభించాడు. మీజాన్ అనగా త్రాసు అని అర్థం. తెలుగు మీజాన్ పత్రికకు అడవి బాపిరాజు సంపాదకుడుగా వ్యవహరించాడు. 

గోలకొండ పత్రిక 

ఈ పత్రికను తెలంగాణ ఉద్యమ పత్రికగా పేర్కొనవచ్చును. మే 10, 1925వ తేదీన ప్రారంభించ బడినది. * సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో ఈ పత్రిక వెలువడింది. ఆ పత్రిక పేరును నిర్ణయించేప్పుడు అందులో 'ఆంధ్ర' అనే శబ్దం ఉంచడానికి ప్రభుత్వం నిరాకరించడంతో మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి కలిసి 'గోలకొండ'గా పేరును నిర్ణయించారు. 

తెలంగాణ

1941-42 కాలంలో రాజగోపాల్ మొదలియార్ ఈ దినపత్రికను ప్రారంభించాడు. ఆ బుక్కపట్నం రామానుజా చార్యులు సంపాదకులుగా వ్యవహరించారు. తెలుగులో వెలువడిన మొట్టమొదటి దినపత్రికగా దీనిని పేర్కొనవచ్చును.

ఇమ్రోజ్ 

15 నవంబర్, 1947న షోయబుల్లాఖాన్ చే స్థాపించబడిన దిన పత్రిక ఇది. మందుముల నరసింగరావు సంపాదకత్వంలో వెలువడిన రయ్యత్ పత్రికలో కొంత కాలం పనిచేశాడు. రజాకార్లకు వ్యతిరేకంగా ఏడుగురు ముస్లిం ప్రముఖులు చేసిన ప్రకటనలు ఇందులో యధాతథంగా ప్రచురితమైనవి. ఖాసిం రజ్వీని విమర్శిస్తూ షోయబుల్లా ఖాన్ ఒక సంపాదకీయం కూడా రాశాడు. 1948 ఆగస్టు 21వ తేదీన రజాకార్ల చేతిలో దారుణ హత్యకు గురైనాడు. 

భాగ్యనగర్ 

1936 లో వెలువడిన ఈ పత్రికకు సంపాదక బాధ్యతలు నిర్వర్తించిన భాగ్య రెడ్డి వర్మ తెలుగులో పత్రికా సంపాదకత్వం వహించిన తొలి దలితుడుగా ప్రసిద్ది చెందాడు. భాగ్యరెడ్డి వర్మ అనారోగ్య కారణంగా విధులు నిర్వర్తించలేని పక్షంలో శ్రీకంఠం సత్యనారాయణ స్వామి నాయుడు 'ఆది-హిందు' అని పేరు మార్చి దీని నిర్వహణ బాధ్యతలు తీసుకొన్నారు. 

గ్రామజ్యో తి

1947లో వరంగల్ జిల్లా, జనగామ తాలూకా లోని గూడురు గ్రామానికి చెందిన బొబ్బల ఇంద్రసేనా రెడ్డి నడిపిన గోడపత్రిక. - ఈయన గోడపై వార్తలు రాసి, చెరిపి మళ్ళీ వార్తలు రాసేవాడు. వరంగల్ పత్రికా రంగంలో ప్రభుత్వానికి రూ. 50 జరిమానా చెల్లించిన తొలి పత్రిక ఇది.

జూబ్దుల్-ఉల్-అక్బార్ : ఈ పత్రిక 1833లో ప్రారంభమైనది. భారత దేశంలోని తొలి పత్రికల్లో ఒకటి. దీనికి హైదరాబాద్ తో సంబంధం కలదు. రిసాల తబ్బి: ఇది ఉర్దూ భాషలో ప్రారంభమైనది. 1859లో ప్రారంభించారు. ఇది వైద్య పత్రిక. హైదరాబాద్ లో జర్నలి జానికి బీజాలు ఈ పత్రిక ద్వారానే పడినవి.

డక్కన్ టైమ్స్ : 1864లో ప్రారంభించారు. సికింద్రాబాద్ నుండి వెలువడిన మొదటి దినపత్రిక. + బ్రహ్మ విద్యా విలాస ముద్రణాలయం : వనపర్తి పాలకుల ద్వారా 1870లో నెలకొల్పబడినది. ప్రసిద్ధి చెందిన ముద్రణా లయం.

హైదరాబాద్ టెలిగ్రాఫ్ : 1882లో హైదరాబాద్ నుంచి వెలువడిన ఆంధ్ర పత్రిక ఇది. ది హైదరాబాద్ రికార్డ్ : 1885లో హైదరాబాద్ నుంచి వెలువడినది. 

శేద్యచంద్రిక పత్రిక : ఉర్దూ పత్రిక 'పునూన్'కు అనువాదంగా 1886 నుంచి వెలువడినది. వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక మార్పులను తెలియజేసేది. 

డక్కన్ స్టాండర్డ్ : 1889లో ప్రారంభమైన ఆంగ్ల పత్రిక.

దక్కన్ పంచ్ : 19వ శతాబద్ది చివరలో వచ్చిన ఆంగ్ల పత్రిక ఇది.

మౌలిం-ఇ-నిస్వాన్ : 1892లో జర్నలిజం రూపశిల్పి అయిన మౌల్వీ మొహిల్ హుసేన్ దీనిని ప్రారంభించాడు. ముస్లిం స్త్రీలకు సంబంధించిన సంస్కరణలను గురించి ఈ పత్రిక ఎక్కువగా ప్రచారం చేసేది. సంయుక్త సంఘ వర్తమాని : 1909లో మధిర నుంచి క్రైస్తవ మత ప్రచారం కొరకు వెలువడిన పత్రిక ఇది. 

హితబోధిని : 1913 జూన్ 13వ తేదీన ప్రారంభమైన ఈ పత్రిక మహబూబ్ నగర్ నుండి బండారు శ్రీనివాస శర్మ సంపాదకత్వాన వెలువడినది. తెలంగాణలో పూర్తిస్థాయిలో వెలువడిన తొలి తెలుగు పత్రికగా దీనిని పరిగణిస్తారు. 

ఆంధ్రమాత : 1917వ సంతవ్సరంలో ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్ లోని గౌలిగూడ నుండి స్వామి వెంకట రావు సంపాదకత్వాన దివ్యజ్ఞాన సమాజం తరపున వెలువడిన పత్రిక ఇది. 

ఆది పంచమ : 31 డిసెంబర్, 1918వ తేదీన జె.ఎస్.ముత్తయ్య ఈ ఆంగ్ల మాస పత్రికను ప్రారంభించాడు. ఇది దళితుల చైతన్యం కోసం పనిచేసింది. మూలాంగ్ వర్గమాన : 1920 సంవత్సరంలో ఖమ్మం కేంద్రంగా వెలువడిన క్రైస్తవ మత ప్రచార పత్రిక ఇది. 

సువార్తమణి : 1921లో మహబూబ్ నగర్ నుండి వెలువడిన క్రైస్తవ మత ప్రచార పత్రిక. దేశివాజ్మయ : 1921లో తెలంగాణ లిటరరీ అసోసియేషన్ వారి పక్షాన వెలువడినది. 

నీలగిరి : ఆగస్టు 24, 1922వ తేదీన నల్లగొండ నుండి షబ్నవీసు వెంకటరామ నరసింహారావు ఆధ్వర్యంలో వెలువడిన పత్రిక. ఇది వారపత్రిక. 

తెనుగు : ఆగస్టు 27, 1922వ తేదీన వరంగల్ జిల్లా, ఇనుగుర్తి గ్రామం నుండి ఒద్దిరాజు సీతారామచంద్రరావు - రాఘవ రంగారావు సోదరుల సంపాదకత్వాన వెలువడిన పత్రిక. ఇది వారపత్రిక. ఈ పత్రిక వెనుకబడిన తెలంగాణలో సాహిత్య, సాంఘిక, రాజకీయ చైతన్యం కలిగించడానికి ఎంతగానో దోహదం చేసింది. 

ఆంధ్రాభ్యుదయం : హనుమకొండలోని ఉన్నత పాఠశాలా ధ్యాపకుడైన కోకల సీతారామశర్మ సంపాదకత్వంలో మార్చ్ 1925లో ఈ పత్రిక వెలువడినది. ఈ పత్రిక గ్రాంథిక భాషా వాదాన్ని సమర్ధించేది. గుఱ్ఱం జాషువా, సరిపల్లి విశ్వనాథ శాస్త్రి, బలిజేపల్లి లక్ష్మీకాంతం, ఉమర్ అలీషా, బూర్గుల రామకృష్ణారావు, శేషాద్రిరమణ మొదలైన వారి రచనలు ప్రచురించబడేవి. 

సుబహ్ దక్కన్, నిజాం గెజెట్, సయీఫా : 1924-25 మధ్య కాలంలో ప్రారంభమైనవి. ఈ పత్రికలు హిందువులు ముస్లింల రాజ్యాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు ప్రచురించేవి. 

రహబరే దక్కన్ : ఇది కూడా నిజాంకు అనుకూలమైన ఉర్దూ పత్రిక. ముషీరె దక్కన్ : ఇది ముస్లిమేతరుడు నడిపిన పత్రిక. ఇది మాత్రమే వార్తా పత్రిక లాగా, వార్తలను కొంతవరకు నిష్పక్ష పాతంగా ప్రచురించేది. 

పయామ్ : ఖాజీ అబ్దుల్ గఫార్ సంపాదకత్వంలో వెలువడిన పత్రిక. ప్రగతి శీల భావాలు, ఆధునిక దృక్పథం కలిగిన గఫార్ రజాకార్ల దురంతాలను ఖండించేవాడు. 

నేడు : 1925లో వెలువడిన తొలి ఆంధ్ర-ఆంగ్ల ద్విభాషా అర్ధవారపత్రిక ఇది. దీనికి సంపాదకుడు భాస్కర్. ఆంధ్ర జన సంఘ కార్యకలాపాల పట్ల ఆసక్తిని కలిగించడానికి, విద్యావ్యాప్తికి కృషి చేసింది.

దేశబంధు : 1926 జూలైలో బెల్లంకొండ నరసింహాచార్యులు సంపాదకులుగా రంగారెడ్డి జిల్లా మేడ్చల్ కు సమీప గ్రామ మైన 'మళ్లేవడ్డేపల్లి' నుండి వెలువడినది. దీనికి 'ఆంధ్ర విజ్ఞాన ప్రబోధక మాసపత్రిక' అనే ట్యాగ్ లైన్ గలదు. 

సహకారి : 1926లో వెలువడినది. శైవ మత ప్రచారిణి : 1926లో వరంగల్ నుండి ముదిగొండ వీరేశలింగశాస్త్రి సంపాదకత్వాన వెలువడినది. 

వక్ : నిజాం ప్రభుత్వానికి అనుకూలమైన వ్యాఖ్యలు రాసిన పత్రిక ఇది. దీని సంపాదకుడు అబ్దుల్ రహమాన్ రయీస్. 

రయ్యత్ : 1927లో ప్రారంభించిన ఉర్దూ పత్రిక. దీనికి సంపాదకులు మందుముల నరసింగరావుగారు. 

సుజాత : 1927లో పసుదూముల నృసింహశర్మ సంపాదకుడుగా ఉన్నా మొత్తం బాధ్యత సురవరం ప్రతాప రెడ్డి గారిదే. 

హైదరాబాద్ బులెటిన్ : 1929లో బుక్కపట్నం రామానుజా చార్యులు దీనిని వెలువరించారు. 

దక్కన్ కేసరి : 1934లో సికింద్రాబాద్ నుండి అడుసుమిల్లి దత్తాత్రేయ శర్మ ప్రారంభించారు. ఇది ఆంగ్ల-ఆంధ్ర మాస పత్రిక. 

మద్యపాన నిరోధ సచిత్ర మాసపత్రిక : వెల్దుర్తి మాణిక్య రావు సంపాదకత్వాన 1936లో వెలువడిన పత్రిక. ద డెమోక్రటిక్ : కన్నడ ప్రాంతీయుడైన వి. హెచ్.దేశపాండే వెలువరించిన పత్రిక ఇది. చంచల్ గూడ జైలు నుండి ఈ పత్రికను నడపడం విశేషం. 

దక్కన్ క్రానికల్ : మే 15, 1938వ తేదీన కె.రాజగోపాల్ తో కలిసి బుక్కపట్నం రామానుజాచారి ప్రారంభించిన ఆంగ్ల దినపత్రిక ఇది. 

తెలుగుతల్లి : 1941లో 'ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం' నిర్వహణలో వెలువడి, రాచమల్లు సత్యవతీ దేవి సంపాద కత్వాన రెండు సంవత్సరాలు నడిచినది. వట్టికోట ఆళ్వారుస్వామి, అడవి బాపిరాజు, వెల్దుర్తి మాణిక్యరావు దీనికి సహాయ సంపాదకులుగా పనిచేశారు. 

తరణి : 1942లో సికింద్రాబాద్ నుండి సారస్వత, జ్యోతిష్య ప్రచారానికి వెలువడిన పత్రిక. చిల్లా సుబ్బారావు సిద్ధాంతి దీనికి సంపాదకుడు. 

శోభ : 1947 ఆగస్టు 2వ తేదీన దేవులపల్లి రామానుజా రావు వరంగల్ నుండి ఈ పత్రికను ప్రారంభించారు. 

కాకతీయ : 1944లో వెలువడిన ఈ మాసపత్రికను పాములపర్తి సదాశివరావు మరికొందరు మిత్రులు కలిసి నడిపారు. సంవత్సరంలోపు మూత బడినది. కానీ 1946లో సాంస్కృతిక, ప్రాంతీయ, రాజకీయ సాహిత్య పత్రికగా తిరిగి ప్రారంభించబడినది. దీనిలో పి.వి.నరసింహారావు మూడు పేర్లతో రచించిన రచనలు ప్రచురితమైనవి. 

పేట్రియాట్ : 1946లో వి.హెచ్ దేశ్ పాండే గుల్బర్గా జైలు నుండి లిఖిత పత్రిగా దీనిని నడిపాడు. కాళోజి నారాయణ రావు, బాబిలాల్, నారాయణరెడ్డి, రంగారెడ్డి కూడా ఇందులో పనిచేశారు. 

ఆంధ్రశ్రీ : 1944లో సికింద్రాబాద్ నుండి వెలువడిన పత్రిక ఇది. దీనిని ఆంధ్ర సారస్వత మహాసభ వెలువరించినది. 

భాగ్యనగర్ : 1949లో ఈ పేరుతో మరో పత్రిక వెలువడినది. 1949 జూలో ప్రారంభమైంది. హైదరాబాద్ నుండి వెలువడినది. అయోధ్య రామకవి దీని సంపాదకుడు. 

ఆంధ్రవాణి : బి.నృసింహశర్మ ఈ పత్రికను నడిపాడు. పత్రిక నిర్వహణకు ఈయన హైదరాబాద్ నుండి బెజవాడకు వెళ్ళి అక్కడ పత్రిక నడిపాడు.

వెలుగుపత్రిక : వరంగల్ జిల్లా, జనగామ తాలూకా గూడురుకు చెందిన చౌడవరం విశ్వనాథం నిర్వహిచిన పత్రిక. జనగామ ప్రాంత దొరల దౌర్జన్యాలను వెలుగు లోకి తెచ్చి, ప్రతిఘటించిన వ్యక్తి ఇతను. 

ఆంధ్రకేసరి : ఈ పత్రిక గుండవరము హనుమంత రావు సంపాదకత్వాన మొదట లిఖిత పత్రికగా వెలువడి తర్వాత మాసపత్రికగా మార్పు చెందింది. 

హైదరాబాద్ ప్రచారము : ఇది హైదరాబాద్ ప్రభుత్వ పక్షాన నడిచిన పక్ష పత్రిక. పోలీసు చర్య జరిగిన తర్వాత ఆగిపోయింది.

విభూతి : ఇదొక ధార్మిక సచిత్ర మాసపత్రిక. 

స్వతంత్ర : కమ్యూనిస్టు పార్టీ రహస్య పత్రిక.

శైవమత ప్రచారిణి : కొడిమెలరాజు, లింగాచార్యులు స్థాపించినది. 

బాలసరస్వతి : కోదాడి నారాయణ రావుచే నిర్వహించ బడిన లిఖిత పత్రిక. పూలతోట : కంభంపాటి అప్పన్నశాస్త్రి నిర్వహించిన పిల్లల పత్రిక.

సారథి : తాళ్ళూరి రామానుజాచార్యులు ఈ పత్రికను నడిపారు. 

ప్రత్యూష : ఎం.ఎస్.రాజలింగప్ప విద్యార్థిగా ఉన్నప్పుడు నడిపిన లిఖిత పత్రిక. 

అబ్జర్-ఎ-షరీఫ్ : హైదరాబాద్ నుంచి వెలువడిన మొదటి పర్షియన్ పత్రిక.



Tags :   News Papers in Telangana       Golakonda   

 Meejan     Bhagya Nagar    Imroze  

 Freedom Movement     Deccan Standard   

 Hitabodhini    Telangana History