మిలియన్ మార్చ్ 

తెలంగాణ ఉద్యమ చరిత్రలో “మిలియన్ మార్చ్'కు ఒక విశిష్టమైన స్థానం కలదు. ఈజిప్టులోని తెహ్రీక్ చౌకను ఉద్యమకారులు దిగ్బంధనం చేసి తమ డిమాండ్లు సాధించుకున్న విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని టి.జె.ఎ.సి. మిలియన్ మార్చ్ కు రూపకల్పన చేసింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని 2011 మార్చి 10వ తేదీన నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ నగర నలుమూలల నుండి ట్యాంక్ బండ్ పై 'మిలియన్ మార్చ్' నిర్వహించాలని టి.జె.ఎ.సి. నిర్ణయించింది. విశాల దృక్పథంతో ఉన్న రాజకీయ జె.ఎ.సి.లోని అన్ని పార్టీలు కూడా తెలంగాణ ఉద్యమం కొరకు గాను 'మిలియన్ మార్చ్'లో పాల్గొన్నాయి. 

మార్చి 10వ తేదీన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలున్నందున మిలియన్ మార్చ్ ను వాయిదా వేయాలని విద్యార్థుల తల్లిదండ్రుల విన్నపాన్ని దృష్టిలో ఉంచుకొని జె.ఎ.సి. పరీక్షలు ఉదయం కాబట్టి మధ్యాహ్నం 1 గం|| నుండి 4 గం|| వరకు మిలియన్ మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. మిలియన్ మార్చ్ లో పాల్గొనేందుకు తెలంగాణ వాదులు హైదరాబాద్ కు చేరకుండా ఉండడానికి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అన్ని మార్గాల్లో తనిఖీలు నిర్వహించి అనుమానితులను నిర్బంధించడం, లేదా వెనక్కు పంపడం చేశారు. మిలియన్ మార్చ్ కు తరలి వస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులను అడ్డుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ విద్యార్థులు విజయవంతంగా మిలియన్ మార్చ్ కు హాజరైనారు. సాయంత్రం వరకు సుమారు వేలాదిమంది ఉద్యమకారులు ట్యాంక్ బండ్ ప్రాంతానికి చేరుకున్నారు. తెలంగాణ నినాదాలు, ఆటపాటలు, బతుకమ్మ, బోనాలు వంటి జనజీవన సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. ఎట్టకేలకు వివిధ జె.ఎ.సి.లు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ విజయ వంతంగా నిర్వహించబడింది. ఈ విధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రలో ట్యాంక్ బండ్ పై నిర్వహించిన మిలియన్ మార్చ్ ఒక మహోజ్వల ఘట్టానికి వేదికైంది. 

సకల జనుల సమ్మె 

తెలంగాణ ఉద్యమ చరిత్రలో 'సకల జనుల సమ్మె' అత్యంత కీలకమైన ఘట్టంగా వర్ణించవచ్చు. తెలంగాణలోని అన్ని వర్గాలు, కుల సంఘాలు, ప్రభుత్వ- ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు ఏకమై 'సకల జనుల సమ్మె' చేయడం జరిగింది. సకల జనుల సమ్మె 42 రోజుల పాటు కొనసాగడం ప్రపంచ ఉద్యమాల చరిత్రలోనే ప్రత్యేకమైనదిగా గుర్తించబడింది. వీటి.జె.ఎ.సి. నేతృత్వంలో 2011 సెప్టెంబర్ 13వ తేదీన సకల జనుల సమ్మెకు శ్రీకారం చుట్టబడింది. ఇందులో భాగంగానే తెలంగాణ ఉద్యోగులు విధులను వదిలి రోడ్లపైకి వచ్చారు. ప్రభుత్వ శాఖల సంఘాలన్నీ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. ఉపాధ్యాయులతో సహా ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. కలెక్టర్ల దగ్గర పనిచేసే డ్రైవర్లు, అటెండర్లు సైతం సమ్మెలో పాల్గొన్నారు. విద్యాసంస్థలు సైతం మూతపడ్డాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా సమ్మెలో పాల్గొన్నవి. సెప్టెంబర్ 24, 2011న జరిగిన రైల్ రోకోలతో తెలంగాణ గుండా వచ్చే, పోయే రైళ్ళను నిలిపివేయాల్సి వచ్చింది. తెలంగాణ సమాజమంతా స్వచ్ఛందంగా, ఉత్సాహంగా రహదారులపైకి వచ్చి నిరసనలతో తమ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలిపారు. రహదారులు, కూడళ్ళు, పల్లెలు, పట్టణాలలో 'ధూంధాం' లు నిర్వహించారు. 

సచివాలయంలో జెఎసిని ఏర్పాటు చేయడమే కాకుండా విజయవంతంగా సమ్మె నిర్వహించడానికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సచివాలయ బ్రాంచి చైర్మన్ నరేందర్ రావు చర్యలు తీసుకున్నారు. సచివాలయంలో తెలంగాణాకు చెందిన ఆడపడచులు బతుకమ్మ ఆడి తెలంగాణ సంస్కృతిని చాటారు. ఉద్యోగులు చేస్తున్న ఈ సమ్మెతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఉద్యోగులను భయపెట్టడానికి ప్రయత్నాలను ప్రారంభించింది. సచివాలయ ఉద్యోగ నాయకులను అరెస్టు చేయించింది. ఉద్యోగులు చేస్తున్న సకల జనుల సమ్మెతో తెలంగాణ మొత్తం స్తబ్దుగా మారింది. కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ప్రభుత్వ శాఖలన్నీ మూతపడ్డాయి. ప్రతి ఉద్యోగి రోడ్డుపైకి వచ్చి ఉద్యమంలో పాలుపంచుకున్నాడు. సకల జనుల సమ్మెతో రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్ర ప్రభుత్వానికి సైతం ఉద్యమ తీవ్రతను తెలియపరిచింది. 11, అక్టోబర్ 2011నాడు తెలంగాణ ఉద్యోగుల జె.ఎ.సి. ఆధ్వర్యంలో 'మహాధర్నా' జరిగింది. తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పింది. సమ్మెకాలలో జనజీవనం స్తంభించడండో ప్రజలు ముఖ్యంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని టి.జె.ఎ.సి. సమ్మెను విరమించింది.సమ్మె విరమణ జరిగినప్పటికి ఇతర విధానాల్లో నిరసనలు, ఉద్యమాలు కొనసాగుతాయిని 24 అక్టోబర్, 2011న జె.ఎ.సి.ప్రకటించింది. పల్లె పల్లె పట్టాల పైకి 2011 మార్చి 11వ తేదీన జె.ఎ.సి. ఇచ్చిన పిలుపు మేరకు 'పల్లె పల్లె పట్టాల పైకి' కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రైళ్ళ బందుకు పిలుపునివ్వడం జరిగింది. దక్షిణ మధ్య రైల్వే శాఖ వారు ముందస్తుగానే రైళ్ళ రాకపోకలను నిలిపివేశారు. రాష్ట్రం నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే రాళ్ళ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంతో తెలంగాణ ఉద్యమ తీవ్రత ఢిల్లీని కూడా కుదిపింది. సడక్ బంద్ తెలంగాణలో శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ఉద్దేశ్యంతో జె.ఎ.సి. 2013 మార్చి 21వ తేదీన 'సడ్బంద్'కు పిలుపునిచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ నుండి మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ వరకు సడ్బంద్ విజయవంతంగా జరిగింది.

సాగరహారం 

ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు టి.జె.ఎ.సి. 30, సెప్టెంబర్ 2012 నాడు హైదరాబాద్లో తెలంగాణ మార్చ్ కు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి ఒక పేరును పెట్టాలని ఉద్దేశించిన జె.ఎ.సి. సెప్టెంబర్ 24, 2012వ తేదీన 'సాగరహారం' అనే పేరును ఖరారు చేసింది. ఇందులో భాగంగా రాజ్యాంగం సూచించిన విధంగా కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే ఒకే ఒక్క డిమాంలో తెలంగాణ మార్చ్ కు పిలుపునివ్వడం జరిగింది. “ఇంటికో మనిషి చేతిలో జెండా-ఛలో హైదరాబాద్” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. తెలంగాణ మార్చ్ హైదరాబాద్ లోని గన్‌పార్క్, ఇందిరాపార్క్, ఖైరతాబాద్ ఫ్లెఓవర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ వంటి చోట్ల నుంచి ఊరేగింపులతో ప్రారంభమైనది. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన సాగర హారానికి పోలీసులు పెట్టిన నిర్బంధాలన్నింటిని అధిగమించి ఉద్యమకారులు లక్షలాదిగా తరలి వచ్చారు. 

సంసద్ యాత్ర 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాజకీయ జేఏసీ 2013, ఏప్రిల్ 29, 30 తేదీలలో న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టి దానికి 'సంసద్ యాత్ర'గా నామకరణం చేసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వానికి, పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే దీక్ష చేయడం ద్వారా తెలంగాణ రాజకీయ జేఏసీ తమ నిరసనను తెలియజేసింది. ఈ యాత్రకు ఢిల్లీకి ఉద్యమకారులను తరలించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక రైలును కూడా కేటాయించారు. ఈ ప్రత్యేక రైలుకు “తెలంగాణ ఎక్స్ ప్రెస్”గా నామకరణం చేశారు. ఇందులో వివిధ రాకకీయ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు, టీఎన్జీవో, టీజీవో, ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ, సింగరేణి టీచర్లు, లెక్చరర్లు, విద్యార్థులు, న్యాయవాదులు అంతా కలిసి ఢిల్లీకి బయల్దేరి వెళ్ళి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

వంటా-వార్పు 

కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు, ఏకాభిప్రాయ సేకరణ పేరుతో శ్రీకృష్ణ కమీషన్ ఏర్పాటు చేసిన రోజననే ఈ కార్యక్రమాన్ని మొదట 3, ఫిబ్రవరి 2010 నాడు నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచే ప్రజలు హైదరాబాద్-కరీంనగర్, హైదరాబాద్-వరంగల్ రహదారులపైకి వచ్చి సామూహికంగా వంటల కార్యక్రమాలు నిర్వహించి తమ నిరసనలను తెలపడం ద్వారా రహదారులను స్తంభింపజేశారు. తెలంగాణ రాజకీయ జేఎసీ పిలుపు మేరకు 2011, జూన్ 19వ తేదీన “పట్నం రోడ్లపై పొయ్యి పెడతా” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 

మానవహారం 

తెలంగాణా జేఏసీ పిలుపు మేరకు ఫిబ్రవరి 4, 2010వ తేదీన మొత్తం తెలంగాణలోని ఆరు జిల్లాల్లో 500 కి.మీ. మేర మానవహారం ఏర్పరచి చరిత్ర సృష్టించడం జరిగింది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ వరకు, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మీదుగా కొనసాగించిన ఈ మానవహారంలో లక్షలాది మంది ఉద్యమకారులు పాల్గొనడంతో ఈ మానవహారం దేశ చరిత్రలోనే అతిపొడవైన మానవహారంగా రికార్డులకెక్కింది. ఈ కార్యక్రమం ద్వారా రకరకాల వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చి మానవహారంగా ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను తెలియజేయడం జరిగింది.