ఇంద్ర

ఇంద్ర పూర్తి పేరు 'ఇండియన్ డాప్లర్ రాడార్'. ఇవి ద్విమితీయ (2డీ) రాడార్లు. వీటిని ప్రధానంగా తక్కువ ఎత్తులో ఎగిరే క్రూయిజ్ క్షిపణులు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలను గుర్తించేందుక్ష్ము వాటి గమనాన్ని తెలుసుకునేందుకు (ట్రాకింగ్) ఉపయోగిస్తారు. వీటిని డీఆర్డీవో అభివృద్ధి చేయగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది. వీటిని వాహనాల్లో అమర్చవచ్చు. ఇంద్ర-1 రకాన్ని ఇండియన్ ఆర్మీ, ఇంద్ర-2 పీసీ రకాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉపయోగిస్తున్నాయి. 2డీలో ఒకటి దూరాన్ని, రెండోది కోణాన్ని (అజిమత్ ని) సూచిస్తుంది.

బీఎస్ఎస్ఆర్-ఎస్ఆర్

బ్యాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ రాడార్ - షార్ట్ రేంజ్ కు సంక్షిప్త రూపమే బీఎస్ఎస్ఆర్-ఎస్ఆర్. యుద్ధభూమిలో నడిచే, పాకే సైనికులన్ష్మ దళాలను, భారీ వాహనాలను గుర్తించడానికి ఉపయోగపడే తక్కువ వ్యాప్తిలో పనిచేసే రాడార్ ఇది. దీన్ని సులభంగా మోసుకుని వెళ్లి, 5 నిమిషాల్లో అమర్చవచ్చు. అన్ని పరిస్థితుల్లో, అన్నివేళలా పనిచేస్తుంది. దీన్ని భారత సైన్యం, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) ఉపయోగిస్తాయి.

రోహిణి

ఇది త్రిమితీయ (3డీ), మధ్యంతర వ్యాప్తి నిఘా రాడార్. ఎస్-బ్యాంలో పనిచేసే ఈ డాప్లర్ రాడార్ ని ఉపయోగించి గగనతలంలోని లక్ష్యాలను అత్యంత విశ్వసనీయతతో గుర్తించవచ్చు. త్రీ డైమెన్షన్స్ లో భాగంగా ఇది 360ళ కోణం (అజిమత్)తో 18 కి.మీ.ల ఎత్తులోని లక్ష్యాలను గుర్తించగలదు. దీన్ని విమానాలు, రైళ్లు, వాహనాలన్నింటి ద్వారా సులభంగా రవాణా చేయవచ్చు. దీన్ని ఇండియన్ ఏయిర్‌ఫోర్స్ కోసం అభివృద్ధి చేశారు.

రేవతి

గగనతలం, సముద్ర ఉపరితలంపై ఉండే లక్ష్యాలను గుర్తించేందుకు నౌకల్లో ఉపయోగించే మధ్యంతర వ్యాప్తి ఉన్న త్రిమితీయ నిఘా రాడార్. డీఆర్‌డీవో, బీఈఎల్, ఎల్ అండ్ టీ సంస్థల భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. భారత నావికాదళంలో ఉపయోగించేందుకు దీన్ని తయారుచేశారు.

భరణి

ఇది బ్యాటరీతో నడిచే, తక్కువ ఎత్తులో పనిచేసే అల్ప బరువున్న 2డీ రాడార్ (ఎల్‌ఆర్). పర్వత ప్రాంతాల్లోకి వచ్చే శత్రువుల మానవరహిత (యూఏవీ), దూరం నుంచి నియంత్రించగల ఆర్పివే (రిమోట్స్ పైలెటెడ్ వెహికల్) వైమానిక వాహనాలను గుర్తించేందుకు ఉపయోగపడే 'గ్యాప్ ఫిల్లర్' రకానికి చెందిన రాడార్. దీనిలో ఇంద్ర-2 సాంకేతికతను ఉపయోగించారు. 

రాజేంద్ర

ఇది అధిక శక్తి ఉన్న పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాడ్ అర్రే రాడార్ (పీఈఎస్ఏ). ఇది తక్కువ నుంచి మధ్యంతర ఎత్తులో ఎగిరే శత్రు విమానాల పైకి 12 ఆకాశ్ క్షిపణులను ప్రయోగించే సత్తాని కలిగి ఉంటుంది. ఏకకాలంలో అనేక లక్ష్యాలను, క్షిపణులను గుర్తించి.. వాటి పైకి క్షిపణులను ప్రయోగిస్తుంది. 80 కి.మీ.ల దూరంలో, 18 కి.మీ.ల ఎత్తులోని 64 లక్ష్యాలను గుర్తించడమే కాకుండా, వాటిలోని 4 లక్ష్యాలపై ఒక్కొక్కదానిపై 3 చొప్పున మొత్తం 12 క్షిపణులను ప్రయోగించగలదు.

స్వాతి 

శత్రువుల ఆయుధాలు, మందుగుండు సామగ్రి, రాకెట్ లాంచర్లను ఇది గుర్తిస్తుంది. రాజేంద్ర రాడార్ నుంచి ఈ 3డీ రాడార్ ని అభివృద్ధి చేశారు. ఇది కోహెరెంట్, ఎలక్ట్రానికల్లీ స్కాడ్ సి-బ్యాండ్ పల్స్ డాప్లర్ రాడార్. దీన్నే వెపన్ లొకేటింగ్ రాడార్ (డబ్ల్యూఎల్ఆర్) అని కూడా పిలుస్తారు.

ఆరుద్ర

ఇది 300 కి.మీ.ల దూరంలోని చిన్న లక్ష్యాలను గుర్తించే చతుర్మితీయ(4-డైమెన్షనల్) మీడియం పవర్ రాడార్ (ఎమ్ పీఆర్). దూరం, కోణం (అజిమత్), ఎత్తుతోపాటు లక్ష్యం, వేగానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. దీన్ని భారత వైమానిక దళం ఉపయోగించనుంది. ఇదే తరహాకి చెందిన 4డీ - లో లెవల్ ట్రాన్స్పర్టబుల్ రాడార్ (ఎ టీఆర్) ని 'అశ్విని' అని పిలుస్తారు. ఇది 200 కి.మీ.ల దూరంలోని చిన్న, ఎగిరే లక్ష్యాలను గుర్తిస్తుంది.