కాశ్మీర్ హిమాలయాలు: 

జమ్మూకాశ్మీర్ లో సట్లెజ్ నది వరకు విస్తరించి ఉన్న హిమాలయాలను కాశ్మీర్ హిమాలయాలు అంటారు. వీటి సరాసరి ఎత్తు 3000 కిలోమీటర్లు. వీటిలోనే పీర్ పంజాల్ శ్రేణిలో పీర్ పంజాల్, బనిహాల్ అనబడే కనుమలు కలవు. కాశ్మీర్ లోయ కూడా ఈ పర్వతాలలోనే ఉన్నది. 

పంజాబ్ హిమాలయాలు: 

సట్లెజ్ నది నుంచి వాయవ్య దిశగా సుమారు 570 కి.మీ. పొడవున పంజాబ్ హిమాలయాలు విస్తరించి ఉన్నాయి. వీటిలో జోజిల్లా, టంగ్, బారలెప్ వాలాలు ముఖ్యమైన కనుమలు. హిమాలయాలకు చెందిన ఈ విభాగంలోనే కాంగ్రా, లాహుల్, స్పిటి లోయలు కలవు. పండ్ల తోటలకు, ప్రకృతి సౌందర్యానికి ఈ లోయలు ప్రసిద్ధిగాంచినవి. 

కుమయూన్ హిమాలయాలు: 

సట్లెజ్, కాళీ నదుల మధ్య సుమారు 320 కి.మీ. పొడవున కుమయూన్ హిమాలయాలు వ్యాపించబడి ఉన్నవి. వీటిలో అత్యంత ఎత్తయిన శిఖరం నందాదేవి శిఖరం, కామెట్, బదరీనాథ్, కేదార్‌నాథ్, నందకోట్, గంగోత్రాలు మొదలైన ఇతర శిఖరాలు కూడా వీటిలోనే కలవు. నైనిటాల్, బీమ్ మాల్ వంటి సరస్సులు కూడా ఇక్కడ ఉన్నవి. బదరీనాథ్, కేదార్నాథ్ లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఇక్కడ ఉండడం వలన వీటికి ప్రత్యేకత సంతరించుకున్నది. భాగీరథి, గంగా, యమున నదులు ఈ ప్రాంతం లోనే ఉద్భవించాయి. 

సెంట్రల్ హిమాలయాలు: 

కాళీ నది నుంచి తీస్తా నది వరకు సుమారు 800 కి.మీ. పొడవున ఈ పర్వతాలు విస్తరించి ఉన్న హిమాలయలు సెంట్రల్ హిమాలయాలు. ధవళగిరి, అన్నపూర్ణ, మనస్లూ, ఎవరెస్టు, మకాలు, కాంచన్ జంగ లాంటి శిఖరాలు వీటిలో భాగమే. ఈ పర్వతాలు సిక్కింలో సిక్కిం హిమాలయాలుగాను, పశ్చిమ బెంగాల్ లో డార్జిలింగ్ హిమాలయాలు గానూ, భూటాన్లో భూటాన్ హిమాలయాలుగానూ ప్రసిద్ధి గాంచాయి. అస్సాం హిమాలయాలు: ఇవి తీస్తా నది నుంచి బ్రహ్మపుత్ర నది వరకు సుమారు 720 కి.మీ. పొడవున విస్తరించి ఉన్నాయి. మొత్తంగా 67,500 కి.మీ. విస్తీర్ణాన్ని ఆక్రమించాయి.