ఇనుప ధాతువులు 

విస్తరణ: ఝార్ఖండ్ - సింగ్ భమ్ - ఝార్ఖండ్; ఒడిశా - మయూర బంజ్, కియోంజార్, సుందర్ గర్; చత్తీస్ గఢ్ - బస్తర్ లోని బైలదిల్లా. ఇది దేశంలోనే అతి పెద్దది. దుర్గ్ లోని దల్లిరాజారా; మహారాష్ట్ర - రత్నగిరి, చంద్రపూర్; కర్ణాటక- బళ్లారి, చిత్రదుర్గం, చిక్కమగళూరు, తుమకూరు; గోవా- మర్మగోవా; తమిళనాడు: తిరుచిరాపల్లి, సేలం; తెలంగాణ- ఖమ్మం; ఆంధ్రప్రదేశ్- అనంతపురం, కర్నూలు, కడప, గుంటూరు, నెల్లూరు. 

మాంగనీస్:

విస్తరణ: ఒడిశా: మయూర బంజ్, కియోంజార్, కలహండి, కోరాపుట్, సుందర్ గర్ జిల్లాలు; మహారాష్ట్ర- నాగపూర్, రత్నగిరి, బాంద్రా; మధ్యప్రదేశ్- బాలాగాట్, ఛింద్ వాడా (చింద్వారా) జిల్లా; కర్ణాటక- బళ్లారి, షిమోగా, చిత్రదుర్గ్, తుమకూరు; ఆంధ్రప్రదేశ్- శ్రీకాకుళం, విశాఖపట్నం. 

నాన్ ఫెర్రస్ లోహ ఖనిజాలు 

బాక్సైట్:

విస్తరణ: ఒడిశా రాష్ట్రంలోని కలహండి, కోరాపుట్ లో అధిక నిల్వలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో బాక్సైట్ నిల్వలు ఉన్నాయి.

బంగారం: 

విస్తరణ: దేశంలో బంగారు నిల్వలు తక్కువ. కర్ణాటక- కోలార్ గోల్డ్ మైన్స్, రాయచూర్ లో కేజీఎఫ్ హుట్టి గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్- రామగిరి గోల్డ్ మైన్స్ - అనంతపురం, జొన్నగిరి - కర్నూల్ము పాలచూరు, బిస్వనాధం - చిత్తూరు. 

రాగి:

విస్తరణ: మధ్యప్రదేశ్ - బాల్ ఘాట్, బేతుల్ జిల్లా; రాజస్థాన్ - ఖేత్రి. ఇది ఝు ఝును జిల్లాలో ఉంది. ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం. ఇది 80 కి.మీ. పొడవు, 5 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉంది. అజ్మీర్, అల్వార్ జిల్లాల్లో కూడా ఈ నిల్వలు ఉన్నాయి. ఝార్ఖండ్ రాష్ట్రంలోని సింగ్భమ్, హజారీబాగ్, పాలమాన్ జిల్లాల్లో; ఆంధ్రప్రదేశ్ లోని అగ్నిగుండాల (గుంటూరు జిల్లా) లో రాగి నిల్వలు ఉన్నాయి.

సీసం:

విస్తరణ: రాజస్థాన్ - ఉదయ్ పూర్, దుంగార్పూర్, బన్న వారా, అల్వార్డ్స్ ; ఆంధ్రప్రదేశ్ - కర్నూలు, గుంటూరు, కడప; తెలంగాణ - నల్గొండ, ఖమ్మం; తమిళనాడు - ఉత్తర ఆర్కాట్ మొదలైన ప్రాంతాల్లో లభిస్తుంది.

జింక్: 

విస్తరణ: ఇది సహజంగా గెలీనా ధాతువుతో లభిస్తుంది. అధికంగా (99 శాతం) రాజస్థాన్‌లోని జవార్ (ఉదయ్ పూర్) ప్రాంతంలో విస్తరించి ఉంది.

తగరం (టంగ్ స్టన్):

విస్తరణ: రాజస్థాన్ - రావత్ హిల్స్; ఝార్ఖండ్ - రాంచీ పీఠభూమి; పశ్చిమ్ బంగ - బంకురా జిల్లా,

అలోహ ఖనిజాలు 

అభ్రకం : 

విస్తరణ: దీని ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 95 శాతం అభ్రకం మూడు రాష్ట్రాల నుంచి లభిస్తోంది. ఆంధ్రప్రదేశ్ - నెల్లూరు; ఝార్ఖండ్ - హజారీబాగ్, గిరిది; రాజస్థాన్ - జయపుర (జైపూర్) నుంచి ఉదయ్ పూర్ వరకు ముఖ్యంగా అజ్ మేర్ (అజ్మీర్) ప్రాంతంలో అభ్రకం నిల్వలు అధికం.

సున్నపురాయి :

విస్తరణ: మధ్యప్రదేశ్ - జబల్ పూర్, సాత్నా, బేతువల్, రేవా; రాజస్థాన్ - ఝు ఝును, అజ్ మేర్, టోంక్, సవాయ్ మదోపూర్; ఆంధ్రప్రదేశ్ - కడప, కర్నూలు, గుంటూరు ; తెలంగాణ - నల్గొండ, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్.

ఆస్బెస్టాస్ - రాతినార: 

విస్తరణ: రాజస్థాన్ - ఉదయ్ పూర్, ఆల్వార్, అజ్ మేర్, పాళీ, ఆంధ్రప్రదేశ్ - పులివెందుల (కడప) మొదలైన చోట్ల అధికంగా లభిస్తుంది. 

జిప్సం : 

విస్తరణ: ముఖ్యంగా ఎరువుల పరిశ్రమలో ఉపయోగిస్తారు. ఈ నేలలను సారవంతంగా మార్చడంలో జిప్సం చాలా తోడ్పడుతుంది. 99% జిప్సంను రాజస్థాన్ నుంచే ఉత్పత్తి చేస్తున్నారు. జోధ్ పూర్, నాగౌర్, బికనీర్, చురు, పాళీ. 

వజ్రాలు:

విస్తరణ: మధ్యప్రదేశ్ లోని పన్నా, ఆంధ్రప్రదేశ్ లోని వజ్రకరూరు (అనంతపురం జిల్లా)లో వజ్రాలు లభిస్తాయి. కొత్తగా రాయ చూర్, కలబురగి (గుల్బర్గా) జిల్లాల్లోనూ వలు ఉన్నట్లు కనుక్కున్నారు.