తిరుమల రాయలు

తిరుమల రాయలు తన సామ్రాజ్యాన్ని మూడు భాగాలుగా విభజించి తన కుమారులను ప్రతినిధులుగా నియమించాడు. ఇతడు తిరుపతి, కంచి, శ్రీరంగంలో ఉన్న దేవాలయాలను పునరుద్ధరించాడు. 

మొదటి శ్రీరంగ రాయలు

ఇతడి పాలనా కాలంలో అనేక దండయాత్రలు జరిగాయి. 1576లో బీజాపూర్ అలీషా పెనుగొండను ముట్టడించాడు. 1579 లో గోల్కొండ సుల్తాన్ విజయనగర రాజ్యంపై దండెత్తి అహోబిలాన్ని ఆక్రమించి, అక్కడి నరసింహ ఆలయాన్ని దోచుకున్నాడు. మొదటి శ్రీరంగరాయలికి సంతానం లేనందున చంద్రగిరి రాజప్రతినిధిగా ఉన్న ఇతడి తమ్ముడు రెండో వెంకటరాయలు సింహాసనాన్ని అధిష్టించాడు. 

రెండో వెంకటరాయలు

ఇతడు చంద్రగిరిని రాజధానిగా చేసుకున్నాడు. అరవీటి వంశంలో గొప్పరాజు రెవెన్యూ పాలనను పటిష్టం చేశాడు. ఇతడి పాలనా కాలంలో తూర్పు తీరంలో డచ్చివారు, ఆంగ్లేయులు తమ కర్మాగారాలను నెలకొల్పారు. 

మూడో శ్రీరంగరాయలు

ఇతడు ఆఖరి పాలకుడు. ఇతడి మరణంతో అరవీటి వంశంతో పాటు విజయనగర సామ్రాజ్యం కూడా పతనమైంది.