ఢిల్లీ సుల్తానులు
* ఢిల్లీ సుల్తాన్ రాజ్య స్థాపకుడు ఎవరు?
జ: కుతుబుద్దీన్ ఐబక్
* కుతుబుద్దీన్ మొదటి రాజధాని ఏది?
జ: లాహోర్
* ఢిల్లీ సుల్తాన్ రాజ్యాన్ని పాలించిన మొదటి వంశానికి చెందినవారిలో ఇల్బారి తెగకు చెందని వ్యక్తి ఎవరు?
జ: కుతుబుద్దీన్ ఐబక్
* లాహోర్ లో చౌగాన్ ఆట ఆడుతూ మరణించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: కుతుబుద్దీన్ ఐబక్
* కుతుబుద్దీన్ ఐబక్ ఏ సూఫీ మత గురువు పేరుమీదుగా కుతుబ్ మీనార్ నిర్మాణాన్ని ప్రారంభించాడు?
జ: కుతుబుద్దీన్ బక్తియార్ కకి
* కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత దిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన వ్యక్తి ఎవరు?
జ: ఆరామ్ షా
* దిల్లీ సుల్తాన్ రాజ్య నిజమైన స్థాపకుడిగా పేరుపొందింది ఎవరు?
జ: ఇటుట్ మిష్
* ఇ టుట్ మిష్ ప్రవేశపెట్టిన వెండి నాణేలను ఏమంటారు?
జ: టంకా
* మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఏకైక ముస్లిం పాలకురాలు ఎవరు?
జ: రజియా
* రజియా కాలంలో ఉన్నత స్థానాన్ని పొందిన జలాలుద్దీన్ యాకూత్ ఏ దేశానికి చెందిన వ్యక్తి?
జ: అబిసీనియా
* రజియాపై తిరుగుబాటు చేసిన అల్లునియా ఏ రాష్ట్ర గవర్నర్?
జ: భటిండా
* ఏ విదేశీ యాత్రికుడి రచనలు దిల్లీ సుల్తాన్ల చరిత్ర తెలుసుకోవడానికి ఉపయోగపడలేదు?
జ: అబ్దుల్ రజాక్
* దివాని అరిజ్ అనే సైనిక శాఖను ఏర్పాటుచేసిన సుల్తాన్ ఎవరు?
జ: బాల్బన్
* ప్రజాభీష్టం మేరకు దిల్లీ సుల్తాన్ అయిన వ్యక్తి ఎవరు?
జ: రజియా
* నసీరుద్దీన్ మహమ్మద్ నుంచి ఉలుగ్ ఖాన్ బిరుదు పొందిన వ్యక్తి ఎవరు?
జ: బాల్బన్
* ఇరాన్ నాయకుడు అఫసియాబ్ సంతతికి చెందిన వ్యక్తిగా ఏ దిల్లీ సుల్తాను పేర్కొంటారు?
జ: బాల్బన్
* మొదటిసారిగా భారతదేశంలో పర్షియన్ నూతన సంవత్సర వేడుకలను ప్రవేశపెట్టిన సుల్తాన్ ఎవరు?
జ: బాల్బన్
* మంగోలుల దాడిలో మరణించిన బాల్బన్ కుమారుడు ఎవరు?
జ: మహమ్మద్
* పక్షవాతంతో మరణించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: కైకుబాద్
* ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు?
జ: జలాలుద్దీన్ ఖిల్జీ
* అల్లావుద్దీన్ ఖిల్జీ మొదటి దండయాత్ర ఏ ప్రాంతంపై జరిగింది?
జ: గుజరాత్
* అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో ఓటమి పొందిన మేవాడ్ రాజు ఎవరు?
జ: రతన్ సింగ్
* గుజరాత్ ఆక్రమణ తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరిని గుజరాత్ గవర్నర్ గా నియమించాడు?
జ: అల్ఫ్ ఖాన్
* పద్మవత్ గ్రంథ రచయిత ఎవరు?
జ: మాలిక్ మహమ్మద్ జయసి
* క్రీ.శ. 1305లో మాల్వాను ఆక్రమించిన అల్లావుద్దీన్ సేనాని ఎవరు?
జ: ఐన్-ఉల్-ముల్క్ ముల్తాని
* మాలిక్ కపూర్ చేతిలో ఓటమి పొందిన కాకతీయ రాజు ఎవరు?
జ: రెండో ప్రతాపరుద్రదేవుడు
* ఘియాజుద్దీన్ తుగ్లక్ అసలు పేరు ఏమిటి?
జ: ఘాజి మాలిక్
* అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు?
జ: భాగ 29.
జొహార్ పద్ధతి గురించి తన రచనలో పేర్కొన్నది ఎవరు?
జ: అమీర్ ఖుస్రూ
* పన్ను బకాయిలను పూర్తిస్థాయిలో వసూలు చేయడానికి అల్లావుద్దీన్ ఏర్పాటుచేసిన నూతన శాఖ ఏది?
జ: దివాని ముస్తక్ రాజ్
* గుర్రాలకు ముద్రలు వేసే విధానాన్ని ప్రవేశపెట్టిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: అల్లావుద్దీన్ ఖిల్జీ
* మార్కెట్ల నియంత్రణ కోసం అల్లావుద్దీన్ ఖిల్జీ నియమించిన అధికారిని ఏమని పిలిచేవారు?
జ: షెహ్న-ఇ-మండి
* అల్లావుద్దీన్ ఖిల్జీ ఏ సంవత్సరంలో మరణించాడు?
జ: 1316
* అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో గుర్రాల వ్యాపారం ఎవరి ఆధీనంలో ఉండేది?
జ: ఆఫ్ఘన్లు
* తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు?
జ: ఘియాజుద్దీన్ తుగ్లక్
* తుగ్లక్ కు ఏయే తెగలకు చెందినవారు?
జ: కరౌనా టర్క్
* తుగ్లకాబాదను నిర్మించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: ఘియాజుద్దీన్ తుగ్లక్
* మహమ్మద్ బీన్ తుగ్లక్ అసలు పేరు ఏమిటి?
జ: జునాఖాన్
* అజ్ మేర్ (అజ్మీర్)లోని మొయినుద్దీన్ చిట్టీ సమాధిని సందర్శించిన మొదటి దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: మహమ్మద్ తుగ్లక్
* మహమ్మద్ బీన్ తుగ్లక్ తన రాజధానిని దిల్లీ నుంచి ఎక్కడకు మార్చాడు?
జ: దౌలతాబాద్
* 'ప్రతి హిందువు ఇల్లూ టంకశాలగా మారింది' అని పేర్కొన్న చరిత్రకారుడు ఎవరు?
జ: జియావుద్దీన్ బరానీ
* 'చావ్' అనే కాగితపు కరెన్సీని ప్రవేశపెట్టిన మంగోల్ పాలకుడు ఎవరు?
జ: కుయ్ ఖాన్
* దిల్లీ సుల్తాన్ కాలంలో వ్యవసాయ శాఖను ఏమని పిలిచేవారు?
జ: దివాన్-ఇ-కోహి
* కిందివాటిలో మహమ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో ఏర్పాటు చేయని రాజ్యం
జ: కాకతీయ సామ్రాజ్యం
* మహమ్మద్ బీన్ తుగ్లక్ మరణించిన జిట్టా ఏ రాష్ట్రంలో ఉంది?
జ: సింగ్
* బ్రాహ్మణుల నుంచి కూడా జిజియా పన్ను వసూలు చేసిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: ఫిరోజ్ షా తుగ్లక్
* వ్యవసాయ అభివృద్ధి కోసం అనేక కాలువలు తవ్వించిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: ఫిరోజ్ షా తుగ్లక్
* సివిల్, సైనిక పోస్టులను వారసత్వ పద్దతిలో ఇచ్చిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: ఫిరోజ్ షా తుగ్లక్
* తైమూరు దండయాత్ర సమయంలో దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: నసీరుద్దీన్ మహమ్మద్
* మధ్యయుగ చరిత్రలో బాగా చదువుకున్న ముస్లిం పాలకుడిగా పేరుపొందింది ఎవరు?
జ: మహమ్మద్ బీన్ తుగ్లక్
* రెండో అలెగ్జాండర్ గా పేరుపొందిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: అల్లావుద్దీన్ ఖిల్జీ
* ఏ దక్షిణ భారత రాజ్యం దిల్లీ సుల్తాన్ రాజ్యంలో కలవలేదు?
జ: హోయసాలుల రాజ్యం
* సైన్యంలో అత్యున్నత పదవిని అలంకరించిన వ్యక్తిని ఏమని పిలిచేవారు?
జ: ఖాన్
* భూమిశిస్తుగా 50 శాతం ఉత్పత్తిని వసూలు చేసిన దిల్లీ సుల్తాన్ ఎవరు?
జ: అల్లావుద్దీన్ ఖిల్జీ
* ఖలీఫా అధికారాన్ని గుర్తించడానికి అంగీకరించని సుల్తాన్ ఎవరు?
జ: కుతుబుద్దీన్ ముబారక్

.jpg)



Pages