* 'బయాలజి' అనుపదము ఏ భాషనుండి గ్రహించబడింది?
జ. గ్రీక్ భాష
* 'జీవశాస్త్ర పితామహుడు' అని ఎవరికి పేరు?
జ. అరిస్టాటిల్
* 'కణం అని పేరు పెట్టిన శాస్త్రవేత్త?
జ. రాబర్ట్ హుక్
* కణం లోపలి పదార్ధానికి జీవ ద్రవ్యంజప్రోటో ప్లాసం అని పేరు పెట్టిన శాస్త్రవేత్త?
జ. పర్కంజి
* కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు? జ. ప్లీడన్ & ష్వాన్
* ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనిపెట్టిన శాస్త్రవేత్తలు?
జ. నాల్ & రస్కా
* జీవుల దేహంలో ఉండే నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం అని దేనికి పేరు?
జ. కణం
* అన్ని కణాల్లో కెల్లా అతి పెద్దని కణం?
జ. నిప్పుకోడి అండం
* కణత్వచంలో ఉండే ప్రధానమైన పదార్ధాలు?
జ. లిపిడ్లు, ప్రోటీన్లు
* జీవపరిణామ చరిత్రలో మొట్ట మొదట ఏర్పడిన జీవసంబంధ త్వచం?
జ. కణత్వచం
* అంతర్జీవ ద్రవ్యజాలమునకు ఏకణాంగం అంటి పెట్టుకొని ఉండడం వలన గరుకుగా ఉండును.
జ. రైబోసోమ్ లు
* కణంలో ' జత్మహత్యాకోశాలు' లేక స్వయంవిచ్ఛిత్తి సంచులు అని వేటికి పేరు?
జ. లైసోసోములు
* 'బహురూపకత' ను ప్రదర్శించు కణాంగాలు?
జ.లైసోసోమ్ లు
* బయో ప్లాస్టు ' అని వేటికి పేరు?
జ. మైటో కాండ్రియాలకు
* శుక్రకణ మధ్య భాగంలో ఉండి కదలికకు తోడ్పడే నిర్మాణాలు
జ. మైటోకాండ్రియా
* 'ప్రోటీన్ ఉత్పాదక కర్మాగారాలు'అని దేనికి పేరు?
జ.రైబోసోమ్స్
* రైబోసోమ్ ల పరిమాణాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తారు?
జ. స్వెడ్జ్ బర్గ్ ప్రమాణాలు
* రైబోసోమ్ ల ప్రధాన విధి?
జ. ప్రోటీన్ సంశ్లేషణ
* 'కేంద్రకము'ను కనిపెట్టిన శాస్త్రవేత్త
జ. రాబర్ట్ బ్రౌన్
* 'కేంద్రక త్వచం' ఏ పదార్థాలతో నిర్మితం
జ.లిపిర్లు, ప్రోటీన్లు
* ప్రోటీన్లను నిల్వచేసే ల్యూకోప్లాన్లు
జ.అల్యురో ప్లాస్టు

.jpg)



Pages